ఋతుచక్రం … తావో చిన్, చీనీ కవి
చంక్రమణం చేస్తున్న ఋతువులు స్వేచ్ఛగా పరిభ్రమిస్తున్నాయి.
ప్రాభాత సమయపు అద్భుతమైన ప్రశాంతత నలుదెసలా ఆవరిస్తోంది
వసంతఋతు సూచకములైన దుస్తులు ధరించి
నేను తూరుపు పొలాలను కలయతిరుగుతున్నాను.
హేమంతపు తుది మొయిళ్ళు పర్వతాగ్రాలను తుడిచిపోతున్నై.
సాలెగూడువంటి సన్నని తెలిమంచు అకసాన్ని మరుగుపరుస్తోంది.
ఇక కొద్దిరోజుల్లో, దక్షిణగాలి తగలడమే ఆలస్యం,
పాలుపోసుకున్న గింజ రెక్కలు అలలుగా విచ్చుకుంటుంది.
.
తావో చిన్
(365 – 427)
చీనీ కవి
.
Turning Seasons
.
Turning Seasons turning wildly
Away, morning’s majestic calm
Unfolds. Out in spring clothes,
I roam eastern fields. Lingering
Clouds sweep mountains clean.
Gossamer mist blurs open skies.
And soon, feeling south winds,
Young grain ripples like wings.
.
T’ao Ch’ien
(365 – 427)
Chinese Poet
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
ఇలాంటివే