మితభాషికి నిర్లక్ష్యాన్నీ,
భక్తితో ప్రవర్తించే వానికి కపటత్వాన్నీ
నిర్మల మనస్కునికి వంచననీ
వీరునికి క్రూరత్వాన్నీ
లోకాన్ని త్యజించినవానికి శత్రుత్వాన్నీ
సరససంభాషికి నక్కవినయాలనీ
హుందాగా ఉండేవ్యక్తికి అహంకారాన్నీ,
మంచి వక్తకి వాచాలత్వాన్నీ
విశ్వాసంగా ఉండేవారికి వ్యక్తిత్వలేమినీ
లోకం ఆపాదిస్తూనే ఉంటుంది.
దుర్బుద్ధితో ఆలోచించే వారి
దూషణని తప్పించుకోగల
సుగుణం లోకంలో, అసలు, ఉందా?
.
భర్తృహరి
సంస్కృత కవి
Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి