పొలాలన్నీ పంటతో బరువెక్కి ఉన్నాయి
కూలీలు సరిపడినంతమంది లేరు
అయినా సోమరిపోతులు అంటున్నారు:
“చెయ్యడానికి ఏమీ లే”దని.
జైళ్ళు క్రిక్కిరిసి ఉన్నాయి
ఆదివారం ప్రార్థనా తరగతులకు
హాజరు అంతంతమాత్రం; ఐనా మనం
“చెయ్యడానికి ఏమీ లే”దని అంటున్నాం.
తాగుబోతులు మరణిస్తూనే ఉన్నారు—
వాళ్లు మన పిల్లలే అన్నది నిజం
తల్లులు చేతులుకట్టుకు నిలబడి ఉన్నారు
“చెయ్యడానికి ఏమీ లేక”.
అవిశ్వాసులు మరణిస్తున్నారు.
వాళ్ల రక్తం మీ మీద చిందుతోంది.
మిరందరూ ఎలా ఉండగలుగుతున్నారు
“చెయ్యడానికి ఏమీ లే”దని?
.
జేమ్స్ ఎఫ్రియమ్ మెగర్ట్
(1874 – 1930)
ఆఫ్రికన్- అమెరికన్ రచయిత, సంపాదకుడు
.

Photo Courtesy: https://www.ncpedia.org/biography/mcgirt-james-ephraim
స్పందించండి