పిల్లలూ, మెల్లమెల్లగా మీరు గడపదాటి పోతున్నప్పుడు… ల్యూసియస్ ఫ్యూరియస్, అమెరికను కవి
పిల్లలూ, మీరు అంచెలంచెలుగా గడపదాటుతున్నప్పుడు —
ఒకటో తరగతి… తర్వాత కాలేజీ…
తర్వాత మీ స్వంత ఇల్లూ, తర్వాత బహుశా పెళ్ళి—,
ఇన్నాళ్ళూ భద్రంగా దాచిన ఈ నాలుగుగోడల్నీ ప్రేమతో గుర్తుంచుకుంటారనుకుంటాను,
ఈ ఏటవాలు పసుపుపచ్చ పైన్-చూరిల్లూ,
ఇక్కడ మీ రనుభవించిన వెచ్చదనమూ-
వాటిని మీరు జీవితంలో అవవలసినదానికి
అవరోధాలుగా కాక
నిరంతరం విశాలమవుతున్న ఈ ప్రపంచాన్ని ఎదుర్కోడానికి
బలమైన గాలి తోడుగా ప్రయాణమైన మీ
జీవననౌకల్ని క్షేమంగా ఉంచిన ఓడరేవులుగా తలచుకుంటారనుకుంటాను.
నిజమే! లోకంలో చెడ్డ వాళ్ళు ఉన్నారు.
కాని, మీకు రాజమార్గంలో వాహనం నడుపుకుంటూ యాదృచ్ఛికంగా తగిలే మనిషిని
ప్రేమించే తల్లి ఇంటిదగ్గర ఉంటుంది,
వాళ్ళు — నాకు తెలిసి చాలా మంది —
మీలాగే, హాయిగా, ప్రశాంతంగా ఉండే జీవితం మించి ఏదీ కోరుకోరు.
నేను ఈ విశ్వంయొక్క రహస్యాలగురించి పరిశోధించాను గాని,
నాకు ఏ మతం మీద విశ్వాసం లేదని దృధంగా నమ్ముతున్నాను.
నేను ఈ నమ్మకాన్ని మీకు వారసత్వంగా అందించినా,
ఈ భయంకరమైన బరువుని మీ భుజాలమీద మోపినా
నేను క్షంతవ్యుణ్ణి.
బహుశా, అది నా జీవితంలో అతి పెద్ద వైఫల్యం.
(ఆ మాటకొస్తే, నేను మీకిచ్చిన సాధనసంపత్తి ఈ అనంతత్వాన్ని ఎదుర్కోడానికి
పనికొచ్చిందా? కడకి, మనకు మిగిలే ఒంటరితనాన్ని భరించడానికి తగిన శక్తి నిచ్చేయా?)
మీరు ధనవంతులూ, ప్రాజ్ఞులూ కావాలి. అన్నిటికీ మించి,
మనసున్న మనుషులై, అందరితో న్యాయబద్ధంగా వర్తించేవారనిపించుకోవాలి.
మీ అమ్మాకీ నాకూ దొరికినట్టుగానే
మీకూ మంచి ప్రేమ లభించాలి.
మీకు సంతానం కలగాలి! అధికంగా!
తరచు ఇంటికి వస్తూండండి. అదేదో
తల్లిదండులపట్ల పిల్లలుగా మీ బాధ్యత అనుకుని కాకుండా కుతూహలంతో,
ఈ చాదస్తపు ముసలాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుందికి రండి.
.
ల్యూసియస్ ఫ్యూరియస్
అమెరికను కవి

My Children, As You Leave Home Little by Little
.
My children, as you leave home little by little-
first grade school, then college,
your own apartment, perhaps marriage-,
I hope you’ll think fondly of these walls which housed you,
the slanted yellow-pine ceiling you lived under,
the warmth you felt there-
thinking of them not as a barrier
which kept you from being what you needed to
but as a harbor
from which you sallied forth to meet the ever-widening world,
to which you retreated in too-strong wind.
Yes, there are bad people in the world,
but the random person driving on the expressway has a mother who loves him
and most- by far the most-
want nothing more – like you- than peace and happiness.
Though I’ve pondered deeply the universe’s mysteries,
I fear I lack religion.
And if I’ve bequeathed unto you this unbelief,
placed on your shoulders this terrible burden,
I apologize.
It is, perhaps, my greatest failing.
(Are the tools I’ve given you really strong enough to fight infinity? Strong enough to deal with our ultimate aloneness?)
May you be
rich and smart but, above all, kind-
known as someone who treats others fairly.
May you find the sort of love
your mother and I have found.
Have children – lots of them!
Return often! not out of filial duty
but rather curiosity:
‘And what might those old codgers be up to now? ‘
.
Contemporary American Poet
About the poet in his own words:
By day, I work as a software engineer; by night, I scour the Web for things to include in A Poetry-Lover’s Guide To the World-Wide Web . My webpage is the “Humanist Art Homepage” ( https://humanist-art.org/ ).
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి