జాతీయ భద్రత… ఆర్చిబాల్డ్ మెక్లీష్, అమెరికను కవి

 

అక్కడ 3 పేర్లున్నాయి

భద్రంగా దాచిన దస్త్రంలో

రహస్య మందిరంలో

వర్గీకరించబడ్డ అరలలో

దేశభద్రతా భవనంలో.

 

ష్! దాని గురించి గట్టిగా మాటాడవద్దు!

.

మొదటి మరీ పురాతనమైనది

అక్కడ అంతా నల్ల బంగారం

లక్క అంత చల్లన

పసిడి రేగుపళ్ల వాసన.

దాని పేరు కాంబోడియా.

 

రెండవది లావోస్.

మధ్యమధ్య వెండి మెరుపులతో

మెరిసే బంగారు కంఠహారం.

అక్కడి భాష

గిజిగాడు భాషలా ఉంటుంది.

 

మూడవది వియత్నాం.

ఒక సెల్ ఫోను తొడుగులో చుట్టజుట్టి

B-52 బాంబర్లలో

తల్లికి తపాలా పంపబడిన

శుష్కించిన బిడ్ద దేహమది.  

 

 

అక్కడ 3 పేర్లున్నాయి

భద్రంగా దాచిన దస్త్రంలో

రహస్య మందిరంలో

వర్గీకరించబడ్డ అరలలో

దేశభద్రతా భవనంలో.

 

ష్! దాని గురించి గట్టిగా మాటాడవద్దు!

.

అయినా సరే… 

పేర్లు రక్తం ఓడడం మానలేదు.

కారుతున్న రక్తం

రహస్య ద్వారాల క్రిందనుండీ

కిటికీల లోంచీ దేశభద్రతా

భవనం క్రిందకి జారి

పొంగి, ఖండంతరాలకు పారింది.

దేశమంతా రక్తంలో తడిసి ముద్దయింది.

 

ష్! దాని గురించి గట్టిగా మాటాడవద్దు!

.

ఆర్చిబాల్డ్ మెక్లీష్

(May 7, 1892 – April 20, 1982)

అమెరికను కవి

.

 

.

National Security

There are three names

In a locked file

In a secret room

On a classified stair

In the house of state.

They are not to be spoken.

The first is old,

Black and gold,

Cool as lacquer

Smelling of plums.

This name is Cambodia.

The second is Laos,

A flexible necklace

Knotted with silver

Sounds like the language

Of orioles.

The third is Vietnam,

A dried child

Mailed to its mother

By B-52s

In a cellophane envelope.

Three names

in a locked file

in a secret room

on a classified stair

in the house of state:

not to be spoken.

Nevertheless

The names bleed.

The blood runs out

Under the secret

Door and down

The classified stair

To the floor of state

And over the stoop

And out on the continent:

The country is steeped in it.

Not to be spoken.

.

From Collected Poems  (1917- 1982)

Archibald  MacLeich 

(May 7, 1892 – April 20, 1982)

American Poet

 

Poem Courtesy:  

https://books.google.co.in/books?id=KI0ESFOvi5QC&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=true 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: