నిజమే! ఈ ప్రపంచం కష్టాలమయం
అవి లేవని నే ననలేదు.
దేవుడా!నాకు చాలినన్ని కష్టాలున్నాయి,
మొరపెట్టుకుందికి రెండింతల కారణాలు.
వర్షాలూ, తుఫానులూ చిరాకు పెట్టేవి
ఆకాశం ఎప్పుడూ మేఘావృతమై ఉండేది
నా మార్గం నిండా ముళ్ళూ
ముళ్ళకంపలూ నిండి ఉన్నాయి
అయితేనేం, ఈ రోజు బాగులేదూ?
ఎప్పుడూ ఏడుస్తూ కూచుంటే లాభమేమిటి?
బాధలు ఇంకా కొనసాగించడం తప్ప?
ఎప్పుడూ గతాన్ని మనసులో పెట్టుకుని
చింతిస్తే లాభమేమిటి?
ఎవరికి వాళ్ళ బాధలుంటాయి
సుఖాలూ కష్టాలతో పలచబడుతూనే ఉంటాయి
జీవితం, వేడుకచేసుకుందికేమీ లేదు
కష్టాలంటావా? నా పాలు నాకున్నాయి.
అయినా సరే, ఈ రోజు చాలా బాగుంది!
నేను బ్రతుకున్నది ఈ క్షణంలోనే
నెల్లాళ్ళక్రిందట కాదు.
పొందడం, పోగొట్టుకోవడం, ఇచ్చిపుచ్చుకోవడం,
కాలం ఎలా నడిపిస్తే అలా.
నిన్న ఒక దుఃఖ మేఘం
నా మీద బాగా కురిసింది;
రేపు మళ్ళీ వర్షించవచ్చు;
అయినా సరే నే నంటాను
ఈ రోజు బాగులేదూ? అని.
.
డగ్లస్ మలోష్,
(May 5, 1877 – July 2, 1938)
అమెరికను కవి
.
స్పందించండి