తెల్లని మంచు పెల్లలపై గాలి విడిచిపెట్టిన వంకర అడుగు జాడల్లా ఎగిసి మెలితిరిగిన కెరటం అదాటున విరగబడినచోట అలతోపాటు వంపులు తిరుగుతూ, మన పడవ కెరటాలపై అలవోకగా సాగుతుంది. పద! పద! నీటిపుట్టపై నిలువెత్తు త్రోవ అదిగో!
పెనుగాలి రానుంది, తెరచాపలెత్తు… గాలినుండే మనము ఉత్సాహం దొరికించుకోవాలి మనసు దిటవుగా ఉంటే, ఎంత నల్లటిమేఘమైనా తలవంచుతుంది గాలి ఊళలకి మనం భయపడేది లేదు! . విలియమ్ ఎలరీ చానింగ్
(November 29, 1818 – December 23, 1901)
అమెరికను
.
“Our boat to the waves”
.
Our boat to the waves go free,
By the bending tide, where the curled wave breaks,
Like the track of the wind on the white snowflakes:
Away, away! ’T is a path o’er the sea.
Blasts may rave,—spread the sail,
For our spirits can wrest the power from the wind,