Just as Madhava, occupied the three worlds
To subdue the haughtiness of Virochana’s son
His namesake, the Spring, subdued nether world, earth and ether
With cascades of nectar, flowerscape and their spores.
Under the swarm of bees
Savoring the stream of wafting spores
The trees, at spring time, looked like shadows
Standing still and moving hither and thither.
.
Sri Krishnadevaraya
(16 February 1471 – 1529)
Emperor of Vijayanagar 1509- 1529.
ఆముక్తమాల్యద నుండి రెండు పద్యాలు
1
సాంద్ర మకరంద వృష్టి రసాతలంబుఁ
దొరఁగు పువ్వుల భువియుఁ, బూధూళి నభము
నీక్రమత్రయి మాధవుఁ డాక్రమించె
నురు విరోచన జనిత మహోష్మ మడగ.
[మాధవుడు: విష్ణువు, వసంతుడు
విరోచనుడు: సూర్యుడు, ప్రహ్లాదుని కొడుకు(బలిచక్రవర్తి తండ్రి) ]
2
ఊరుకొనబడు మధూళిక
యోడికలకుఁ గ్రిందఁ గ్రమ్మి యుండెడు తేంట్లన్
నీడలు దిరిగియుఁ దిరుగని
జాడఁ దరుల్వొలిచె నవ్వసంతపు వేళన్
[మధూళిక: పుప్పొడి ; ఓడిక: ప్రవాహము; ]
శ్రీకృష్ణదేవరాయలు…
ఆముక్తమాల్యద నుండి
ఆశ్వాసము 5, పద్యం 136 & 138
Courtesy: https://www.facebook.com/notes/telugu-poetry/srikrishnadevaraya-two-poems/1640616216012031/
స్పందించండి