The Angst… Ravi Verelly, Telugu Indian.

When the butterflies squiggle poems in their flight for flowers,

Or, the wind and the blades of straw are locked in playing piggy-ride

Or, when spectra open up their pinions full on the tails of sunrays

You enter into my thoughts.

*

After your departure

When I was struggling to find answers to the seething questions…

Sun rose as usual, and

As did the rain after him.

The sapling you planted bloomed so wildly

That it provided enough flowers for a lifetime.

The star you tossed away while leaving

Cast such a brilliance that it illuminated the whole firmament.   

Suddenly-

Days — longing for the nights, and

Nights — longing for the days, till then

Stopped singing dirges of lovesickness.

When the value of things lost was completely off my mind;

And it was clear that sunny days

Were banished forever in my life ahead,

At the knell of the parting day

While I was casting feed for young birds

You surfaced

Like a sizzling dagger on the brink of night.

Surprisingly, ingesting all colors

You spewed a trail of infinite darkness.

When I was only searching for questions

My body had turned into a brush in your hands!

I was left wondering what the answer would be;

And anxiously waiting for what its color could be.  

.

Ravi Verelly

Mr. Ravi Verelly is a Software Architect with TMEIC. He lives in Roanoke, Virginia.

Ravi is a poet of very fine poetic sensibilities and and a commensurate poetic diction. He is very nostalgic about his village Amudalapalle and his childhood. He brought out his maiden collection of poems in Telugu … Doopa (Thirst) in 2012. He is on the  Editorial Board of Telugu Web Magazine Vaakili since its inception in January 2012. This year he brought ot his second collection of Poetry “కుందాపన” (The Angst)”.

 

 

కుందాపన

 

పూలకోసం తుమ్మెదలు గాల్లో పద్యాలు రాస్తున్నపుడో

గాలీ, గడ్డిపరకా ఉప్పుబస్తాట ఆడుకున్నప్పుడో

కిరణాల తోకలమీద నీటిరంగులు పురివిప్పినపుడో

నువ్వే గుర్తొస్తావ్

 

నువ్వెళ్ళాక-

ప్రశ్నలకు జవాబులు వెదుక్కునే రోజుల్లో-

ఎప్పట్లానే సూర్యుడొచ్చాడు

తర్వాత వానా వచ్చింది.

నువ్వెళ్తూనాటిన మొక్క

జీవితానికి సరిపడేన్ని పూలని పూసింది.

నువ్వెళ్తూ విసిరిన నక్షత్రం

ఆకాశానికి సరిపడేన్ని వెలుగుల్నీ చిమ్మింది.

 

హటాత్తుగా-

పగళ్ళకోసం రాత్రులు

రాత్రులకోసం పగళ్ళు

విరహగీతాలు పాడుకోవడం మానేసాయి.

పోగొట్టుకున్నవేమిటో పూర్తిగా మరిచిపోయాక

మిగిలినవన్నీ పగళ్ళని వెలేసిన రోజులే అని తేలిపోయాక

మునిమాపుమూలమలుపులో

పావురాలకోసం గింజలు జల్లుతున్నప్పుడు

చీకటి అంచున పిడిబాకులా తళుక్కుమని

మళ్ళీ నువ్వుకనిపించావ్.

రంగుల్ని మింగేసి

చిత్రంగా చీకటిని ఉమ్మేసావ్.

 

ప్రశ్నల్ని మాత్రమే వెతుకుతున్నప్పుడు

నా దేహం నీకుంచెగా మారిపోయింది!

సమాధానం ఏమిటా అని చూస్తూ వుండిపోయాను.

దాని రంగేమిటా అని ఎదురు చూస్తూ వుండిపోయాను.

.

రవి వీరెల్లి

 

కుందాపన (2017) సంకలనం నుండి