ఎవరన్నారు ఈ పిల్లల్ని ఎగిరిపోనివ్వాలని?
ఈ పిల్లలు మన పేగుతో ముడిపడినవాళ్ళు
వాళ్లకి మన అవసరం ఉంటుంది, చివరకి ఎగిరిపోనివ్వడమేనా?
(నేను ఈ మాటలు అనవలసి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు)
ఋతువులన్నీ సంగీతంలోని స్వరాల్లా
క్రమంతప్పకుండా వచ్చిపోయే
ఈ ఇంటి చెట్టుకి దగ్గరలోనే …
ఏ కొమ్మమీదో గూడుకట్టుకుంటే, ఏమిటిట నష్టం?
ఈ-ఉత్తరాలనీ, పుట్టినరోజు కార్డులనీ, ఫోన్లనీ
ఎప్పుడూ మనం రొట్టె తునకలే ఎందుకు ఏరుకోవాలి?
తక్కినవాళ్లందరూ వాళ్ళపిల్లలతో హాయిగా ఉంటే
మనమెందుకు ఇట్టే గడిచిపోయే శలవులతో సర్దుకుపోవాలి?
సాహసం చెయ్యాలని మనమే నూరిపోసామనుకో;
అయినా, ఎవరనుకున్నాడు వాళ్లంత స్వేచ్ఛగా ఎగిరిపోతారని?
.
కెరొలీన్ రఫేల్
అమెరికను కవయిత్రి .
Photo Courtesy:
http://carolynraphaelpoetry.com/
Between You and Me
.
Who says we have to let them fly,
these children who were bound by cords
of flesh, then need, then, finally, sky?
(I never thought I’d say these words.)
What’s wrong with nesting close to home
in branches of the family tree,
where seasons, like a metronome,
count days of continuity?
Why must we always savor crumbs—
the emails, birthday cards, and calls,
the hurried holiday that numbs—
while others celebrate their smiles?
Of course we championed bravery;
who ever thought they’d fly so free?
.
Carolyn Raphael
American
6 Longview Place
Great Neck, NY 11021
craphael429@gmail.com
Poem Courtesy:
http://www.poemtree.com/poems/Between-You-and-Me.htm
స్పందించండి