కవిహృదయం… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను (మనవి : ఈ కవితకి శీర్షిక లేదు. ఎలా వీలర్ విల్ కాక్స్ తన Poems of Passion అన్న పుస్తకంలో ముందుమాటకంటే ముందుగా ఈ కవితని పెట్టుకుంది.) *** ఓ పాఠకుడా!నేను పాడుకున్న ఏదో గీతాన్ని చదివినంతమాత్రాన ఏ హృదయపులోతులలోంచి వచ్చిందో నువ్వు పసిగట్టగలవా? కవి కన్న కల ఎన్నడైనా బయటకు గట్టిగా చెబుతుందా దాని రహస్యపుటాలోచనలను వింటున్న జనసమూహానికి? ఏదీ, లేచి సముద్రపుటొడ్డునున్న ఒక శంఖుని తీసుకో— నీకేమిటి కనిపిస్తుంది? దాని ఆకారం, రంగూ. అంతే! విశాలమైన మహాసాగరపు అట్టడుగున దాగున్న రహస్యాలలో ఏ ఒక్కటైనా నీకు చెబుతుందా? మనగీతాలన్నీ అలాటి శంఖులే, లోచనాసముద్రాలు ఒడ్దుకు విసిరినవి; ఇప్పుడు నీకు ఏది ఆనందాన్నిస్తే దాన్ని ఏరుకో; అంతేగాని నువ్వు సముద్రపు అలలదిగువనంతా చూసేనని పొరబడకు. అక్కడ మునకలేసిన ఓడలేకాదు, పగడపు దీవులుంటాయి. . ఎలా వీలర్ విల్ కాక్స్ November 5, 1850 – October 30, 1919 అమెరికను కవయిత్రి . . Oh, you who read some song that I have sung— What know you of the soul from whence it sprung? Dost dream the poet ever speaks aloud His secret thought unto the listening crowd? Go take the murmuring sea-shell from the shore— You have its shape, its color —and no more. It tells not one of those vast mysteries That lie beneath the surface of the seas Our songs are shells, cast out by waves of thought, Here, take them at your pleasure; but think not You’ve seen beneath the surface of the waves, Where lie our shipwrecks, and our coral cave. . Ella Wheeler Wilcox November 5, 1850 – October 30, 1919 American Page 7, Poems of Passion, Belford-Clarke Co. Chicago, 1890. Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే మార్చి 18, 2017
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు#188120th CenturyAmericanElla Wheeler WilcoxWoman కొత్త జీవితం… ఆస్కార్ వైల్డ్ ఐరిష్ కవిమార్మిక కవిత 2… రూమీ, పెర్షియను సూఫీ కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.