మా కతని పేరు ఎలా తెలిసిందంటే… ఏలన్ డూగన్, అమెరికను కవి

నది కొట్టుకొస్తోంది
చచ్చిన గుర్రాలనీ, శవాలనీ,
శిధిలమైన యుద్ధ సామగ్రినీ,
ప్రవాహానికి ఎగువన యుద్ధమో,
అధికార యంత్రాంగపు చర్యలో
జరుగుతోందనడానికి సూచిస్తూ.
అవన్నీ కొట్టుకుపోయాయి, ఆ మాటకొస్తే
అన్నీ కొట్టుకుపోతాయి, ఏదీ మిగలదు
అదే నదిలోని ప్రత్యేకత.
తర్వాత ఒక దుంగమీద
ఒక సైనికుడు కొట్టుకుంటూ వచ్చేడు.
అతన్ని చూస్తే బాగా తాగినట్టున్నాడు.
అతన్ని అడిగేము: అతనూ, ఆ చెత్తా
అలా ఎగువనుండి కొట్టుకురావడానికి
కారణం ఏమిటని.
“మిత్రులారా,” అంటూ ప్రారంభించేడు,
గ్రానికస్ మహా సంగ్రామం
ఇప్పుడే పరిసమాప్తమయింది.
స్పార్టన్లూ, నేనూ మినహా
గ్రీకులు అందులో విజయం సాధించేరు.
ఇది నాకూ, అలెగ్జాండరు అన్న వ్యక్తికీ
మధ్య పేరుకి జరిగిన పోరాటం.
అరె బాబా, మీరందరూ రేపు అతనొక
దేవుడిగా కీర్తించబడడం వినబోతునారు.”
.

ఏలన్ డూగన్
ఫిబ్రవరి 12, 1923 – సెప్టెంబరు 3, 2003)
అమెరికను కవి

 

 

How We Heard The Name

.
The river brought down
dead horses, dead men
and military debris,
indicative of war
or official acts upstream,
but it went by, it all
goes by, that is the thing
about the river. Then
a soldier on a log
went by. He seemed drunk
and we asked him Why
had he and this junk
come down to us so
from the past upstream.
“Friends,” he said, “the great
Battle of Granicus
has just been won
by all the Greeks except
the Lacedaemonians and
myself; this is a joke
between me and a man
named Alexander, whom
all of you ba‑bas
will hear of as a god.”
.

Alan Dugan

(12th Feb 1923 – 3 Sept 2003)

American Poet

Poem courtesy:

http://www.npr.org/2011/04/06/134745994/poetry-with-an-edge-the-acerbic-wit-of-alan-dugan

 

 

.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: