అనువాదలహరి

కన్నులు… చెస్లా మీవోష్, పోలిష్ కవి

ఘనమైన నా కనులారా, మీరు అంత కుశలంగా ఉన్నట్టు లేదు,

మీదగ్గరనుండి నాకు వస్తున్న ఆకారాలు అంత నిశితంగా ఉండడంలేదు,

రంగుబొమ్మలయితే, మరీను , మసకగా అలికినట్లుంటున్నాయి.

ఒకప్పుడు మీరు రాజుగారు వేటకి తీసుకెళ్ళే వేటకుక్కల్లా ఉండేవారు,

మీతో నేను ప్రతిరోజూ ఉదయాన్నే షికారుకి వేళ్ళేవాడిని.

అద్భుతమైన చురుకుదనం కల నా కనులారా! మీరు చాలా విషయాలు చూసేరు,

నగరాలూ, ప్రదేశాలూ, దీవులూ, మహాసముద్రాలు.

అప్పుడే కరుగుతున్న మంచు జాడల్లో

స్వచ్చమైన చిరుగాలి మనని పరుగులుతీయిస్తుంటే

జతగా మనం ఎన్నో బ్రహ్మాండమైన సూర్యోదయాలను స్వాగతించాం

మీరు చూసినవన్నీ ఇపుడు నా మదిలో భద్రంగా ఉన్నాయి

జ్ఞాపకాలుగానో, కలలుగానో మిగిలిపోయి.

నేను ఈ సుందరమైన ప్రకృతినుండి దూరంగా నిష్క్రమిస్తున్నాను

పిచ్చి పిచ్చి దుస్తులన్నా, అరుపులూ, చప్పుళ్ళన్నా

ఈ మధ్య నాకు చికాకు రావడం గమనిస్తున్నాను.

ఎంత ప్రశాంతంగా ఉందో, మనుషుల మధ్య

మౌలికమైన పోలికలూ, వెంట్రుకవాసి తేడాలూ

గమనిస్తూ వాటిగురించి ఆలోచిస్తుంటే.

కళ్ళుమూసుకుంటే, నా దృష్టి ఒక కాంతిబిందువుపై నిలిచి,

అది వ్యాకోచిస్తూ వ్యాకోచిస్తూ నన్ను తనలోకి లాక్కుంటోంది.

.

చెస్లా మీవోష్

30 June 1911 – 14 August 2004

పోలిష్ కవి 1980 Nobel Prize

 .Czesław Miłosz

.

Eyes

 My most honorable eyes, you are not in the best of shape.

 I receive from you an image less than sharp,

 And if a color, then it’s dimmed.

 And you were a pack of royal greyhounds once,

 With whom I would set out in the early mornings.

 My wondrously quick eyes, you saw many things,

 Lands and cities, islands and oceans.

 Together we greeted immense sunrises

 When the fresh air set us running on the trails

 Where the dew had just begun to dry.

 Now what you have seen is hidden inside me

 And changed into memories or dreams.

 I am slowly moving away from the fairgrounds of the world

 And I notice in myself a distaste

 For the monkeyish dress, the screams and drumbeats.

 What a relief. To be alone with my meditation

 On the basic similarity in humans

 And their tiny grain of dissimilarity.

 Without eyes, my gaze is fixed on one bright point,

 That grows large and takes me in.

.

Czeslaw Milosz

30 June 1911 – 14 August 2004

Polish Poet, Translator and Diplomat  

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2005/09/eyes-czeslaw-milosz.html

2 thoughts on “కన్నులు… చెస్లా మీవోష్, పోలిష్ కవి”

 1. 1. “Together we greeted immense sunrises
  When the fresh air set us running on the trails
  Where the dew had just begun to dry.” “మన అడుగుజాడల్లో స్వచ్చమైన చిరుగాలు పరుగులేస్తుంటే.” అన్నది ‘చిరుగాలిలో మన పరుగులో’ అనుకుంటానండి ‘చిరుగాలులు’ అయినా సరే. పొగమంచు ఆవిరవటం అన్నది మీరు విస్మరించారా/మరిచారా? ఈ పంక్తుల అనువాదం తో పెచే వచ్చేసింది నాకు  ౨. “less than sharp” అన్నది ‘నిశితంగా’ అనేకన్నా ‘స్పష్టంగా’ అని తర్జుమా అయుంటే బాగుండేదా?! ఎందుకంటే ఆ తర్వాత ‘మసకగా’ అనే పదానికి జతగా పడినట్లు ఉండదూ? 3. చురుకుదనం కల -> చురుకుదనం గల/తీక్ష్ణత కలిగిన 4. ‘సుందరమైన ప్రకృతి’ కూడా సరైన భావాన్ని ఇవ్వటం లేదు, కవి తాను కాంచిన అందాలు, పొందిన అనుభూతుల తర్వాత సంత/రణగొణ ధ్వనులతో కూడిన ప్రపంచం రుచించకపోవటం చెప్తున్నట్లుగా నాకు అర్థమైంది మరి! — చివరగా చాలా ఎత్తిచూపినట్లుగా కనిపిస్తే మన్నింపు కోరుతూ …

  మెచ్చుకోండి

  1. ఉషారాణిగారూ,

   1. Thank you for the comments and bringing out an error to my attention. I missed the line “Where the dew had just begun to dry.” It made all the difference and I rewrote it.

   2. ఇక్కడ Clarity(స్పష్టత)కంటే Sharpness(సునిశిత) మీదే ప్రాముఖ్యత ఉంది. వయసు ముదిరి అంతర్ముఖుడైన కవి, తన కన్నులు ఆధారంగా చేసుకుంటూ ఒక Philosophical journey గురించి చెబుతున్నాడు. When he was young he was after the beauties of nature. He was able to see things clear and sharp in the nature. But as advanced, he now realizes his interests his interests have changed. What was attractive earlier is no longer attractive. That is why when he closed his eyes, a small bright spot, that all of us experience while looking into ourselves, has started expanding and he is merging into it. This is culmination of life as I understand it. The tone of the poem is given by the last few lines. He is not complaining
   3. You are always welcome and please feel free to comment without any reservation. Our aim is to leave a legacy of good literature.

   with very best regards.
   Murty

   మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: