ఆకస్మిక వెలుగు… డాంటే గేబ్రియెల్ రోజేటీ, ఇంగ్లీషు కవి

నేనిక్కడకి ఎప్పుడో వచ్చేను,
కానీ ఎప్పుడో, ఎలాగో చెప్పలేను:
ఆ తలుపు దాటిన తర్వాత పచ్చని పచ్చిక
దాని ఘాటైన సువాసనా,
ఆ నిట్టూర్పుల చప్పుడూ, తీరం వెంట దీపాలూ పరిచయమే.

ఒకప్పుడు నువ్వు నా స్వంతం,-
ఎన్నాళ్ళ క్రిందటో చెప్పమంటే చెప్పలేను:
కానీ, ఆ పిచ్చుకలు ఎగురుతున్నపుడే
నీ మెడ అటుతిరిగింది,
తెలియని తెర ఒకటి నీపై పడింది- నాకు తెలుసు అదంతా గతమని.

అప్పుడుకూడా ఇలాగే ఉండేదా?
సుడితిరుగుతూ ప్రవహించే కాలం
మనజీవితాలతో పాటు మన ప్రేమనీ తిరిగి ఇచ్చి
మృత్యువును ఎదిరించి అయినా సరే
ఒక పగలూ రాత్రికీ మరొకసారి ఆనందాన్ని ప్రసాదించ రాదా?
.
డాంటే గేబ్రియల్ రోజేటి

ఇంగ్లీషు కవి

.

 .

Sudden Light

  I have been here before,        

    But when or how I cannot tell:     

  I know the grass beyond the door, 

    The sweet keen smell,

The sighing sound, the lights around the shore.  

  You have been mine before,—       

    How long ago I may not know:    

  But just when at that swallow’s soar      

    Your neck turned so,

Some veil did fall,—I knew it all of yore.          

  Has this been thus before?   

    And shall not thus time’s eddying flight

  Still with our lives our love restore

    In death’s despite,    

And day and night yield one delight once more?

.

Dante Gabriel Rossetti

(12 May 1828 – 9 April 1882 )

English Poet, Painter, Sculptor and Translator 

Poem Courtesy:

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds. 

Volume VI. Fancy.  1904.

Poems of Sentiment: III. Memory

http://www.bartleby.com/360/6/134.html

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: