ఈ రోజు కీట్స్ వర్ధంతి
మృత్యుముఖంలో కూడా ఆర్ద్రమూ, రసభరితమేగాక, ఉన్నతమైన తాత్త్వికభావనలతో నిండిన ఎంతటి గొప్ప కవిత అందించేడో చూడండి.
ఈ రాత్రి నాకు నవ్వెందుకొచ్చింది? ఎవరూ చెప్పలేరు.
నిష్ఠగా సమాధానం చెప్పగల ఏ దేముడూ, ఏ దయ్యమూ
స్వర్గం నుండి గాని, నరకంనుండి గాని దయతో కరుణించదు.
కనుక నేను శీఘ్రమే మనసులోకి తోంగిచూసుకోవాలి:
ఓ మనసా! మనిద్దరం కలిసి, ఒంటరిగా, విషణ్ణంగా ఇక్కడ ఉన్నాంగదా,
నాకు నవ్వెందుకొచ్చిందో చెప్పవూ? అబ్బా ఈ బాధం ప్రాణం తీస్తోంది!
ఓహ్ చీకటి! అంతా చీకటి! నేను శాశ్వతంగా ఈ స్వర్గాన్నీ,
నరకాన్నీ, ఈ మనసునీ వ్యర్థంగా ప్రశ్నించుకుంటూ పోవాల్సిందేనా?
నాకు ఎందుకు నవ్వొచ్చింది? నాకు తెలుసు జీవితం ఎన్నో రోజులు లేదని
అయినా నా ఊహ అది అందివ్వగల తీయని అనుభవాలకు అర్రులుజాస్తోంది.
కొంపదీసి ఈ రాత్రికి రాత్రే నేను మరణించి,
ఈ సృష్టిలోని సొగసులన్నీ చెల్లాచెదరైపోవుగదా?
కవిత్వం, కీర్తీ, సౌందర్యం చాలా గాధమైన భావనలు.
వాటన్నిటికంటే మృత్యువు గాఢమైనది, అది జీవితానికి కడపటి కానుక!
.
జాన్ కీట్స్
(31 October 1795 – 23 February 1821)
ఇంగ్లీషు కవి

స్పందించండి