A wretched Mother… Madduri Nagesh Babu, Telugu, Indian

Did you ever notice a pool of tears

In front of any government hospital’s mortuary?

That was just my mother, sir!

Did you ever encounter a lone cross lying by a pit

That was not fortunate enough to find a grave to stand by?

That was also my mother, Sir!

My mother was not Yasoda.

That did not mean she was a Kausalya, either.

When I cried breathlessly of hunger

My mother never lifted me up to feed with trifles-on-fingertips

From a silver bowl showing me the full moon.

When I plagued her for gingelly candy,

She was either irritated or beat me black and blue, Sir,

But never implored me over and over to take baby snacks.

When I could never see a trace of delight in her eyes for once,

What damn poem do you expect me to write on such a mother?

If all others praise their mothers in paeans, well, let them.

Their mothers are blessed noblewomen,

And they never had to worry for their next meal.

What, after all, was my mother?

She was nameless, and had always been called in ‘hey’s, ‘you’s

And was never destined for a respectful address.

Poor wretch! She moiled for life for a mouthful of grovel.

If I venture to write a few lines of rune

Do you think the phonemes would consent?

Prosody would accommodate?

When all mothers were asleep oblivious to the world

That labor mother of mine was abused amidst heaps of threshed grain;

When all those rich mothers were receiving best-mother awards

My street-wench mother was paying for quenching her thirst with a gulp of water.

When all their mothers had been de facto leaders and ruled

My wretched mother was staging protests in front of government offices;

If the word ‘mother’ triggers in others some glorious images 

Of their mothers feeding them or singing them lullabies,

It triggers the images of one toiling in the fields…

Either weeding out or carrying loads overhead in a salver, Sir!

What do you expect me to write

On my crude, uncivil mother

Who had no sense of her womanhood from day break

Until the moment my dad raps her at night? 

Sir, my mother never sang me lullabies…

For, her gullet had gone dry of hunger.

She did not even gently put me to sleep…

Her hands had long turned to agricultural implements.

You don’t know sir!

When all the children went out for picnic

Holding the little fingers of their mothers

I was tucking myself in a footling breech position

In the belly vale of my mother, Sir!

When all children were hailing their mothers

As visible examples of the invisible God

Sir, I was scolding my mother with vengeance

For having failed to pay my school fee. 

When the sons were upset

For a mere headache of their rich noble mothers

I was just cursing within

why my sick mother had not died yet.

What could I say?

After coming home drenched in rain once,

When I reached for her sari to dry my head

A thousand patches jeered at me, sir!

As I child when I greedily

pressed my mouth to her breast in hunger

You don’t now, her bare ribs pricked me, sir!

Sir! Say whatever you like. But

Amidst a host of mothers reviled as beasts

Who yean offspring that treat fellow beings as beasts

To speak of my mother

Who is just a human being and nothing else,

This language, this poesy are grossly inadequate! 

.

Madduri Nagesh Babu

(15 August 1964 … Jan 10, 2005)

Telugu, Indian

Nagesh Babu  was born to  Anasuyamma  and Jakariah in Satuluru Village Near Narsarao Pet. He was a Graduate from Andhra Christian College Guntur,  Post Graduate in English Literature from Andhra University, Visakhapatnam  and an M. Phil  from Telugu University Hyderabad in Comparative Literature.  A very powerful Dalit Voice, he authored Velivada (1995), Rachabanda (1996), Loya (1997), Meerevutlu (1998) Nishani (1995, With Varadaiah, Teresh Babu and Khaza), Naraloka Prarthana, collection of Dalit Christian poetry (Dec.2002), and Godavari and Putta, long poems published posthumously.

అలగా తల్లి….

ఏ ప్రభుత్వాసుపత్రి శవాలకొట్టు ముందయినా

ఒక కన్నీటి మడుగును చూసారా… అది మా అమ్మే

ఏ సమాధుల దొడ్లోనయినా కనీసం చావుబండకి నోచుకోని

బొందమీద మొలిచిన ఏకాకి శిలువని చూసారా?…

అదీ మా అమ్మేనండీ

మా అమ్మ యశోద కాదు

అలాగని కౌసల్యా కాదు.

ఆకలై గుక్కపట్టి ఏడుస్తున్న నన్నెత్తుకుని చందమామను చూపిస్తూ

వెండిగిన్నిల గోరుముద్దలు తినిపించలేదు మాయమ్మ

నూజీడీలకోసం మారాం చేస్తే నాలుగు తన్ని కసురుకుందేకాని

కొసరి కొసరి బేబీ బిస్కట్లు తినిపించలేదు మాయమ్మ.

ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగినజాడలేదే

అలాంటి మాయమ్మమీద ఏం కవిత రాయమంటారండీ

అందరూ వాళ్ళమ్మలమీద కావ్యాలల్లుతున్నారంటే

వాళ్ళతల్లులు రాజమాతలు కడుపులోచల్ల కదలని క్షీరమాతలు

మా అమ్మదేవుందండీ

అసే ఒసే అనే తప్ప ఒక పేరన్నదే లేనిది.

లంజముండా అని తప్ప గౌరవవాచకానికి నోచుకోనిది

బతుకంతా గుక్కెడు గంజినీళకోసమే దిగులుపడి డీలాపడ్డ పిచ్చిది

అలాంటి మా అమ్మమీద కవిత్వమంటే

అక్షరాలంగీకరిస్తాయంటారా?

లక్షణాలువొదుగుతాయంటారా?

అందరితల్లులూ ఆదమరిచి సుఖనిద్రలు పోతున్నప్పుడు

నా కూలితల్లి పంటకుప్పల మధ్య పరాభవమైపోయింది

ఉన్న తల్లులంతా ఉత్తమమాతల పురస్కారాలందుకుంటున్నప్పుడు

నా వాడతల్లి గుక్కెడు నీళ్ళు తాగినందుకు జరిమానాలు కడుతూ వుంది

అందరి తల్లులూ అపరనాయకురాళ్ళయి ఏలికలు చేస్తున్నప్పుడు

నా అలగా తల్లి ప్రభుత్వాఫీసులముందు ధర్నాలు చేస్తూవుంది

ఎవరికైనా అమ్మంటే పాలుపడుతూనో జోల పాడుతూనో గుర్తొస్తే

నాకు మా అమ్మ కలుపుతీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండీ

కోడి కూసింది మొదలు రాత్రికి నాన్నతట్టిందాకా

తనకసలు ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకురాని

నా మొరటుతల్లిమీద

ఏంరాయమంటారండీ?

నాకు మా అమ్మ ఎప్పుడూ జోలపాలేదండీ

దానిగొంతెప్పుడో ఆకలితో పూడుకుపోయింది

నన్ను మా అమ్మ ఎప్పుడూ జోకొట్టైనా లేదండీ

దాని చేతులెప్పుడో వ్యవసాయపనిముట్లుగా మారిపోయాయి.

పిల్లలందరూ తమతల్లుల చిటికినవేళ్ళు పుచ్చుకుని వనభోజనాలకెళ్తుంటే

నేను మా అమ్మ డొక్కలోయలోకి ముడుక్కుని పడుకునాను సార్!

బిడ్డలంతా తమ తల్లులని ప్రత్యక్షదైవాలుగా కీర్తిస్తుంటే

నేను ఫీజుకట్టలేని నా తల్లిని కసితీరా తిట్టిపోస్తున్నాను సార్!

కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే  తల్లడిల్లుతున్నప్పుడు

నేను నా రోగిష్టి తల్లి ఇంకా ఎందుకు చావలేదా అని గొణుక్కున్నాను సార్!

ఏం చెప్పమంటారండీ!

వానలో తడిసొచ్చి తుడుచుకుండామని  అమ్మకొంగందుకుంటే

కోటి మాసికలు  నన్ను వెక్కిరించాయండీ

చిన్నప్పుడు ఆకలై మా అమ్మరొమ్మును ఆబగా నోటికదుముకుంటే

నాకు దానిపక్కటెముకలు గుచ్చుకున్నాయండీ

ఏదేమైనా సార్!

సాటిమనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కని

పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య

మనిషికాక మరేమీ కాని నా తల్లిగురించి చెప్పాలంటే

ఈ భాషా ఈ కవిత్వం ఎప్పటికీ సరిపోవు సార్!

.

మద్దూరి నగేష్ బాబు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: