ఇది షేక్స్పియర్ 400వ వర్ధంతి సంవత్సరం
***
మిత్రులకీ, నా బ్లాగు సందర్శకులకీ సంక్రాంతి శుభాకాంక్షలు
వృధాగా గడిపిన కాలాన్ని చరిత్రకెక్కించినపుడు
అందులో అందమైన వ్యక్తుల వివరాలు చదువుతున్నప్పుడు
మరణించిన అందమైన స్త్రీలనూ, వీరులనూ పొగుడుతూ
అందాన్ని, అందంగా మలిచిన కవిత్వం చదివినపుడు…
అందమైన వ్యక్తుల చేతుల్నీ, పాదాల్నీ, పెదాల్నీ,
కళ్ళనీ, కనుబొమల్నీ సొగసుగా చేసిన ఆ వర్ణనలలో,
అంత ప్రాచీన కవులూ, వాళ్ళ ఊహలలో చెప్పింది
చాలవరకు ఇప్పుడు నీ సొమ్మయిన అందమని తెలుస్తోంది.
కనుక, వాళ్ళ పొగడ్తలన్నీ కేవలం భవిష్యవాణులు
ఈ కాలంలో మూర్తీభవించిన నిన్ను, కల్పనతో చెప్పినవి;
వాళ్ళు ఖచ్చితంగా దివ్య చక్షువులతో చూసి ఉంటారు
నీ గుణాల్ని పొగడడానికి, తగిన శక్తి వాళ్ళకి లేదు;
కాని, ఈ కాలంలోపుట్టి నిను స్వయంగా చూడగలుగుతున్నా మాకు
ఆశ్చర్యపోగల కళ్ళయితే ఉన్నాయి, పొగడగల శబ్దచాతురే లేదు.
.
షేక్స్పియర్
ఇంగ్లీషు కవి
వ్యాఖ్యానించండి