అతని గొప్పదనాన్ని నే నెన్నడూ తెలుసుకోలేకపోయాను.
ఒక్కొసారి తను నా పక్కనే, అడుగులో అడుగు వేసుకుంటూ,
నెమ్మదిగా ఎలా నడిచే వాడంటే
చాలా సాదాసీదాగా, నా ఆలోచనల్లాగే
రెక్కలురానట్టు. అప్పుడు నాతా బాతాఖానీ కొట్టేవాడు,
తనకి నచ్చేది కూడా.
గరుత్మంతుడంతకాదుగాని, తన వెడల్పు రెక్కలు ముడుచుకుని
నాతో నడవడానికి ఇష్టపడేవాడు,
అది అతను కావాలని కోరుకున్నదే.
కానీ, నా మిత్రుడు
చాలా సామాన్యుడిలాగే ఉండేవాడు.
నేను మరిచేపోయాను.
కాని ఒక్కసారి రోదసీ కుహరాల్లోంచి
ఒక పెద్ద పిలుపు విన వచ్చింది.
సమున్నతమైన మానవ అస్తిత్వ శిఖరాలనుండి స్పష్టంగా.
అంతవరకు నాతో మసలిన నా మిత్రుడు దాన్ని విన్నాడు.
విని, ఆ శిఖరాగ్రాలతో లీనమై సంభాషిస్తూ
నా పక్కనుండి లేచి, పైకి ఎగిసిపోయాడు.
అప్పుడు నాకు గుర్తొచ్చింది.
నేను ఆకాశంలోకి దృష్టి సారిస్తాను అతనికోసం.
నేను అప్పుడు చూశాను
ఆకసపు నేపథ్యంలో… దూరంగా
అతని రెక్కలమీద సూర్యుని బంగారు వన్నె తళుకులు.
.
యూనిస్ టీట్యెన్స్
అమెరికను కవయిత్రి, నవలాకారిణి, సంపాదకురాలు

వ్యాఖ్యానించండి