మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైనవాళ్ళు
వాళ్లు నాగలివెంట నడిచి, ఒళ్ళు వంచిపనిచేసేవారు
వాళ్లు విత్తనాలు నాటుతూ పొలమంతా తిరిగే వాళ్ళు
వాళ్ళు నేలపని చేసి, పంటపండించేవారు.
వాళ్ళు దృఢంగా,ఎప్పుడూ ఏవో పాటలు పాడుకుంటూఉండేవారు
మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైన వాళ్ళు
మా అవ్వలకీ మామ్మలకీ ఎన్నో జ్ఞాపకం ఉండేవి
కుంకుడుకాయ, ఉల్లిపాయ, తడిమట్టి వాసన వేసేవాళ్ళు
వాళ్ళ చురుకైన చేతులమీద నరాలు ఉబ్బి వంపులుతిరిగేవి
వాళ్లు ఎప్పుడూ ఏదో మంచిమాట చెబుతూనే ఉండేవారు
మా అవ్వలూ అమ్మమ్మలూ బలమైనవాళ్ళు
మరి నేనెందుకు వాళ్లలా లేను?
.
మార్గరెట్ వాకర్
July 7, 1915 – November 30, 1998
అమెరికను కవయిత్రి
.

.
Leave a reply to vanajavanamali స్పందనను రద్దుచేయి