పాపాయి పాదాలు, గవ్వల్లా గులాబివన్నెలో ఉన్నాయి, మనకి మోహము కలిగి, దైవముచితమని అనుగ్రహిస్తే, ఒక దేవత పెదాలు ముద్దాడాలనుకున్నపుడు మనకు ముందుగా కనిపించేవి పాపాయి పాదాలే.
సూర్యుడివైపు తిరిగే గులాబిరంగు వనధిపుష్పాల్లా అవి ఆకాశంవైపు ప్రతి లిప్తా సాగుతూ, లేస్తాయి ఆ పది కోమలమైన మొగ్గలూ కలుస్తూ వేరవుతుంటాయి.
విరిసి ముకుళించే ఏ కుసుమ కోరకమూ అందులో సగపాటి నెత్తావినైనా విరజిమ్మలేదు పాపాయి పాదాల్లా
జీవితపు కొత్తదారులలో వెలుగు వెదజల్లలేవు.
II
పాపాయి చేతులు, ముడుచుకున్న మొగ్గలు పక్కన ఏ చిగురూ కనిపించకపోయినా; ముట్టుకుంటే చాలు తెరుచుకుంటాయి ముంగురుల్లా మళ్ళీ చుట్టుకునే పాపాయి చేతులు.
రణభేరీ వినిపించగానే యోధుల చేతులు కత్తులు బిగించి పట్టుకున్నట్టు అవి ముడుచుకుని, పటకాల్లా పట్టుబిగిస్తాయి.
వాటికి, అత్యంత సుందరమైన ప్రదేశాలలో వేకువ ముత్యాలదండలేసిన గులాబిమొగ్గలు సైతం దీటు రావు; సృష్టిలో ఎంతటి మనోహరమైన కుసుమమైనా పాపాయి చేతులముందు దిగదుడుపే.
III
పాపాయి కన్నులు భాషిస్తాయి, పలుకు రాకముందే, పెదాలు మాటలూ, నిట్టూర్పులూ నేర్వకముందునుండే, వాటి దృష్టిని ఆకట్టుకోగల అన్ని వస్తువులనీ అనుగ్రహిస్తాయి పాపాయి కన్నులు.
పాపాయి నవ్వుతూ పడుకుంటే, నిద్ర వస్తూ పోతూ దోబూచులాడుతుంటే, ప్రేమకి అందులో స్వర్గమే సాక్షాత్కరిస్తుంది.
వాళ్ళ ఒక్క చూపు చాలు పాపాలూ, కష్టాలూ పటాపంచలు; వాళ్ళ మాటలు మేధావుల్ని సైతం నోరుమూయిస్తాయి. పాపాయి కన్నుల్లో కనువిందు చేసే దైవం తారాడుతున్నట్టు అనిపిస్తుంది. .
వ్యాఖ్యానించండి