ఎదురుచూపు… రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి

(ఈ కవిత తన భార్య ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ మృతి సందర్భంగా 1861లో వ్రాసినది.)

మృత్యువంటే భయపడుతునానా?  గొంతులో చల్లదనం ప్రారంభమై

ముఖాన్ని చలిగాలి తాకి,

మంచు పేరుకోడం ప్రారంభమై, ఈదురుగాలులు వీస్తున్నాయంటే

నేను ఆ ప్రదేశానికి చేరువయ్యానన్న మాట.

రాత్రి చూడబోతే బలీయము, విరుచుకుపడుతోంది తుఫాను

పట్టవలసింది శత్రు స్థావరం

అక్కడ భయంకరమైన శత్రువు కంటికెదురుగా నిలిచిన్నప్పటికీ

సాహసికుడు ముందుకు పోక తప్పదు

ప్రయాణం ముగిసింది, శిఖరం చేతికందింది,

సరిహద్దులు కూలిపోయాయి

బహుమతి చేతికి చిక్కే వరకూ పోరాడవలసి ఉన్నా, కడకి

అన్నిపోరాటాలకీ అదే బహుమతి

నేను నిత్య పోరాట యోధుణ్ణి— ఇది మరొక్క పోరాటం

చివరదీ, అన్నిటిలోకి మిన్న ఐనదీ

మృత్యుభయం కళ్ళకు గంతలు కట్టి, నిర్వీర్యం చేసి,

నామీద పెత్తనం చెలాయించడం  నాకు నచ్చదు;

లాభం లేదు. దాని అంతు చూడవలసిందే, పూర్వపు వీరుల్లా

నా సహచరుల్లా పోరాడవలసిందే.

ముందుండి ఎదుర్కోవాలి, ఒక్క నిముషంలో జీవితంలోని

వేదనల, నిరాశల, నిర్లిప్తతల బాకీలు చెల్లించాలి

ధీరులకి పరిస్థితి ఒక్కసారిగా విషమించడమే మంచిది,

చివరి ఘడియ ఎంతసేపో ఉండదు

ప్రకృతిశక్తులు ముమ్మరమై, అంతవరకూ ఉత్సాహపరచిన

మిత్రుల మాటలు పలచనై, గాలిలో కలిసి

ఆగిపోతాయి. బాధలలోంచి మొదట నిష్కృతి లభిస్తుంది,

వెనువెనకనే ఒక వెలుగు; తర్వాత గుండె ఆగుతుంది.

ఓ నా ప్రాణంలో ప్రాణమా! నేను నిన్ను మళ్ళీ హత్తుకుంటాను

తక్కినది అంతా పరమాత్మలోనే!

.

రాబర్ట్ బ్రౌనింగ్

ఇంగ్లీషు కవి.

.

Prospice* 

.

Fear death? — to feel the fog in my throat,

The mist in my face,

When the snows begin, and the blasts denote

I am nearing the place,

The power of the night, the press of the storm,

The post of the foe;

Where he stands, the Arch Fear in a visible form,

Yet the strong man must go:

For the journey is done and the summit attained,

And the barriers fall.

Tho’ a battle’s to fight ere the guerdon be gained,

The reward of it all.

I was ever a fighter, so — one fight more,

The best and the last!

I would hate that death bandaged my eyes, and forebore,

And bade me creep past.

No! let me taste the whole of it, fare like my peers

The heroes of old,

Bear the brunt, in a minute pay glad life’s arrears

Of pain, darkness and cold.

For sudden the worst turns the best to the brave,

The black minute’s at end,

And the elements’ rage, the friend-voices that rave,

Shall dwindle, shall blend,

Shall change, shall become first a peace out of pain,

Then a light, then thy breast,

O thou soul of my soul! I shall clasp thee again,

And with God be the rest.

.

(Note: Prospice in Latin means “Looking Forward”)

Robert Browning 

7 May 1812 – 12 December 1889

English Poet and Playwright

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: