Some friendships are such.
Before you feel your wings
They take you off into the skies;
Before you recall the imperative of nesting
They leave, leaving a mark perdu.
They excurse you down dells and dales
Round brooks and creeks ignoring your why’s;
Having nothing else to do
You have to follow without demur.
They teach you how to take wings
And identify the elements of flora
On condition of secrecy;
Being so naïve of everything else
You have to concede without dissent.
The color of the green woods
the prominence of far off mountains
the comeliness of inflorescence
could be known only when they let;
That what slants on your face is a rain,
What streams in the rill is water,
What gambols around you is wind,
You have to learn only as they teach.
You should pray that a tree bears its fruit visible,
And when a crop yields, you reap all its grain.
You have to migrate to Springs before Fall
And to dawns before plants abscise inflorescence.
*
That you have light in the day, darkness at night;
Should not roam in the sun, nor sing under moon
That you have to take more water, breathe more air
And end this life … as a flower that drops off
God!
There will be no end or limit to the whelm of advices
You never feel like getting that skill.
The ultimate gnosis that dawns on you:
That age is not a measure of experience
Life is too brief for such enterprise
That you have to live your own life
And bid adieu all alone.
Hey, bulbul,
Are you still alive?
If so, what have you to say?
.
Nandakishore
Telugu
Poet and Lyricist

Nanda Kishore is a young engineer (EEE) from Warrangal.
He released his maiden volume of poetry “Neelage okadundevaadu” (There was one like you) in 2014.
Nanda Kishore has fine sensibilities and has come out with a distinct voice of his own.
పునర్విమర్శ 3
.
కొన్ని స్నేహాలూ అంతే.
రెక్కలొచ్చాయని తెలిసేలోపే
ఆకాశాలవైపు ఎగరేసుకుపోతాయ్.
గూడుకట్టాలని గుర్తొచ్చేలోపు
కనపడని గుర్తేదో ముద్రించి పోతాయ్.
ఎందుకో అడగొద్దంటూ
కొండకోనలు, వాగువంకలు తిప్పుకొస్తయ్.
ఏ పనీ లేనందుకు
మౌనంగావెళ్ళిపోవాలి.
ఎవరికీ చెప్పొద్దంటూ
రెక్కలెలావిప్పుకోవాలో, పూలనెలాగుర్తుపట్టాలో
నేర్పిస్తయ్.
ఏ తెలివీ లేనందుకు
సడిచేయకుండా అనుసరించాలి.
పచ్చని చెట్ల రంగుని, దూరపుకొండల ఎత్తుని,
పూసేపూల అందాన్ని, అవి చెప్తేనే తెలుసుకోవాలి.
వాలుగాకురిసేది వాననీ, వాగులోపారేది నీరనీ,
వచ్చిపోయేది గాలనీ, అవి నేర్పగా నేర్చుకోవాలి.
చెట్టు కాస్తే పండ్లు పైనే ఉండాలనీ,
చేను పండితే గింజలు రాలాలనీ కోరుకోవాలి.
ఆకురాలేముందు వసంతాలకి
పూతరాలేముందు పూర్వాహ్నాలకీ వలసపోవాలి.
పొద్దుటపూట వెలుగనీ, సాయంకాలం చీకటనీ
ఎండపూటతిరగొద్దనీ, వెన్నెలపూటపాడొద్దనీ
నీరు తాగాలనీ, గాలి పీల్చాలనీ
పువ్వులు రాల్చినట్టు ప్రాణం రాల్చాలనీ
దేముడా!
ఆ ఉపదేశాలకి అద్దూ అదుపూ ఉండదు.
ఆ నేర్పు ఎన్నటికీ చదవాలనిపించదు.
చివరగా వచ్చే అజ్ఞానమేమంటే
వయసుతో అనుభవం రాదనీ
అనుభవిస్తే బతుకు సరిపోదనీ
నీ బతుకు నువ్వే బతకాలనీ
నీలాగే నువ్వు చావాలనీ…
ఇంకా బతికే ఉన్నావా?
ఉంటే ఏమంటావు బుల్ బుల్?!
.
నందకిషోర్
(“నీలాగే ఒకడుండేవాడు!” సంకలనం నుండి.)
స్పందించండి