A Soldier who dwarfed the sun… Aranya Krishna, Telugu, Indian

This land is still damp

With every drop of blood

That dripped from your bed of arrows;

The motes of dust under your feet

Sent for diagnostic tests

Continue to transmit relentlessly

The ‘power’ful impulses of your body

From police laboratories;

Your severed forearm

By transforming into several pennants

Nestles cozily in our hands;

The haft of the dagger you left behind

Is absolutely safe in our fists; and

Standing in the same dock you presented your defense

We are raising slogans.

 

The witness boxes are getting larger and larger;

The courts are getting narrower and narrower;

The prisons are overflowing;

All citizens get accused on one ground or other;

And the Judiciary is adopting police uniform

The panicles that once merrily surrendered to sickles

Are being harvested by the bayonets now;

Before the crack of dawn

The dazed sunflowers are blooming

In the gory twilight of bleeding encounters;

And the roosters cock-a-doodle-doo

The grief of mothers who lost their sons.

Every inch of the land

Craves for the footprints of your words.

Donating every limb one after another

You lent muscle to our thoughts.

You have become the indelible ink of our writings.

Broadcasting your blood-bathed sayings

We are now on the process of raising your-likes again.

.

Aranya Krishna

(Remembering Cherabanada Raju on his birthday July 2nd.)

.

Aranya Krishna  Photo Courtesy:  BOOKS ADDA
Aranya Krishna
Photo Courtesy:
BOOKS ADDA

సూర్యుడిమీద వెలుగు చిమ్మిన వీరుణ్ని స్మరించుకుంటున్నాను

.

అంపశయ్యమీద నుండి

నువ్వు రాల్చిన ప్రతి నెత్తుటిబొట్టు

చిత్తడిచిత్తడిగా తగులుతూనే వుంది

పరిశోధనలకోసం పంపిన

నీ కాళ్ళ కింద మట్టి రేణువులన్నీ

పోలీస్ లేబొరేటరీల నుండి

నీ దేహ విద్యుత్ ప్రకంపనల్ని

నిత్యం ప్రసారం చేస్తూనే వున్నాయి

ఖండించబడిన నీ ముంజేయి

కలాలుగా చీలిపోయి

మా చేతుల్లో ఇమిడి పోతున్నది

నువ్వు వదిలిన కత్తి పిడి

మా పిడికిళ్ళలో భద్రంగానే వున్నది

నువ్వెక్కి వాంగ్మూలం ఇచ్చిన బోనులో నిలబడే

మేమూ అరుస్తున్నం

బోన్లు విశాలమైపోతున్నాయి

న్యాయస్థానాలు ఇరుకైపోతున్నాయి

జైళ్ళు పగిలిపోతున్నాయి

ప్రజలందరూ నిందితులుగా గుర్తింపబడుతున్నారు

జడ్జీలందరూ ఖాకీరంగు యూనిఫారం తొడుక్కుంటున్నారు

రైతు కొడవలికి ఆనందంగా తలవంచిన

పంటచేలని బాయొనెట్లు నరుకుతున్నాయి

సూర్యోదయం కాకముందే

ఎంకౌంటర్ నెత్తుటి వెలుగుల్లో

పొద్దుతిరుగుడు పూలు దిగ్భ్రాంతిగా విచ్చుకుంటున్నాయి

తొలికోళ్ళు తల్లుల గర్భశోకాల్ని కూస్తున్నాయి

నేల అణువణువూ

నీ అక్షరాల అడుగుల కోసం తపిస్తున్నది

ఒక్కో అవయవాన్ని త్యాగం చేస్తూ

ఆలోచనలకు మాంసకండరాల్ని చేకూర్చావు

కలాల్లో రక్తమై ఇమిడిపోయావు

రక్తాక్షరాలు చల్లుకుంటూ

నిన్ను నాటుకుంటూ పోతున్నాం.

.

అరణ్యకృష్ణ

(జులై 2 చెరబండరాజుజయంతి సందర్భంగా)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: