అనువాదలహరి

Who Knows?… D. Vijaya Bhaskar, Telugu, India

.

Who knows

What comet catches

This ball of Earth in its tail and

Swings it out of the Milky Way?

What Black hole

Would wide open its mouth like a python

To swallow this clod of earth?

What stormy seas raging up the skies

Would inundate this land in deluge

And sweep it away to unknown shores?

What meteor … like an Osprey

Swoops down deftly

To pluck this earth-fish in its claws?

Which doomsday flare

Towers up into an inferno

To torch and set this planet ablaze?

Which unruly air

Works up to a devastating wind

To upturn the innocent world?

Which noble matter

Out of fancy for the creation

Turns this earth to a mustard seed ?

Who knows

What amazing celestial events

Are hiding behind this

Cosmic curtain?

As the veils of time slowly unveil

Who can tell

What sublime empyreal

Universal designs by the

Unfathomable unknown would unfold?

.

Dr. D. Vijaya Bhaskar

Dr. D. Vijaya Kumar

 

ఎవరికి తెలుసు?

.

ఎవరికి తెలుసు

ఏ తోకచుక్క తన తోకతో చుట్టి

భూమిని బంతిలా పాలపుంత

అవతలకు విసిరేస్తుందో?

ఏ కృష్ణబిలం కొండచిలువలా

నోరు తెరుచుకుని

ఈ మట్టిముద్దని మ్రింగేస్తుందో?

ఏ మహా జలధులు గగనంలో

ప్రవహిస్తూ ఇటుగావచ్చి

ఇలను ఎటువైపుకు నెట్టివేస్తాయో?

ఏ గ్రహశకలం  విహంగంలా

వాలి “నేలనుచేపపిల్ల”ని

తన్నుకుని ఎగిరిపోతుందో?

ఏ ప్రళయకాలకాంతిపుంజమో

మహోగ్రరూపం ధరించి

ధరణిపైబడి దగ్ధం చేస్తుందో?

ఏ వాయువు కట్టుతప్పి

ప్రభంజన రూపం దాల్చి

పృధ్విని తల్లక్రిందులు చేస్తుందో?

ఏ మహోన్నత పదార్థం

విశ్వరూపచాపల్యంతో

అవనిని ఆవగింజగామార్చేస్తుందో?

ఈ అద్భుత అంతరిక్షం

యవనిక వెనుక

ఏ ఖగోళ సంఘటనలు దాగి ఉన్నవో

ఎవరికి తెలుసు?

కాలం తెరలు తొలగుతూ  ఉంటే,

ఆవిష్కృతమయ్యే

అర్థం కాని పరమాత్ముని

పరమార్థ పారలౌకిక

విశ్వంభర సన్నివేశాలు

ఎవరికి తెలుసు?

డా. దీర్ఘాశి విజయభాస్కర్

 

 

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: