మార్గమధ్యంలో దప్పికతో అతను ఆగేడు
కనుచూపుమేర ఆవరించిన వేడి బంజరులమీంచి
అకస్మాత్తుగా, చల్లని తళతళ మెరుస్తున్న నీటితో
దూరాన అందంగా ఒక పచ్చని బీడు కనిపించింది.
ఎన్నాళ్ళనుండో మనసులో పదిలపరచుకున్న కోరిక
పాదాలక్రింద ప్రేమపూర్వకంగా పచ్చని తివాచీ పరిచింది;
ఊసరక్షేత్రాలు ఒక్కసారిగా రాజనాల చేలుగా మారిపోయేయి.
ఆలస్యమైనవాళ్ళదే నష్టం అన్నట్టు త్రోవ ఎంతో హాయిగా ఉంది.
అతని మనసులో ఆ అపురూపమైన స్త్రీ ఒకసారి మెరిసింది;
మగాళ్ళందరూ కష్టించి ఎదురుచూసే… ఉద్యానం
ప్రతి హృదయమూ కోరుకునే ప్రశాంత మందిరం;
చివరకి ఎలాగయితేనేం, తన తేజోమయమైన గమ్యం చేరుకోగానే,
హతవిధీ! ఎంత దారుణమైన మాయ!
అదంతా ఎడారి ఇసుకమీద ఎడారి సూర్యుడి విలాసం.
.
ఎలా వీలర్ విల్ కాక్స్
November 5, 1850 – October 30, 1919
అమెరికను కవయిత్రి
.
Love’s Mirage
.
Midway upon the route, he paused athirst
And suddenly across the wastes of heat,
He saw cool waters gleaming, and a sweet
Green oasis upon his vision burst.
A tender dream, long in his bosom nursed,
Spread love’s illusive verdure for his feet;
The barren sands changed into golden wheat;
The way grew glad that late had seemed accursed.
She shone, the woman wonder, on his soul;
The garden spot, for which men toil and wait;
The house of rest, that is each heart’s demand;
But when, at last, he reached the gleaming goal,
He found, oh, cruel irony of fate,
But desert sun upon the desert sand.
.
(From Poems of Progress)
Ella Wheeler Wilcox
November 5, 1850 – October 30, 1919
American Poetess
http://www.fullbooks.com/Poems-of-Progress1.html
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి