ముదిమి… ఎడ్మండ్ వేలర్, ఇంగ్లీషు కవి

గాలులు అలసి శోషించి, సాగరాలు ప్రశాంతంగా ఉన్నాయి;

ఉద్రేకాలు చల్లబడినపుడు మనమూ అంత ప్రశాంతంగానూ ఉంటాము.

క్షణభంగురాలై, నశించిపోయేవాటిగురించి

గర్వించడం ఎంత వృధానో మనకి తెలుస్తుంది.

ముదిమి స్పష్టంగా చూడగల ఆ శూన్యాన్ని

యవ్వనంలో ఉన్నపుడు ప్రేమ పొరలు మసకబారుస్తాయి.

ఎన్నో ఎదురుదెబ్బలు తిని, శిధిలమైన ఈ అంధకారపు ఆత్మ గృహం

కాలం చేసిన రంధ్రాలలోంచి కొత్తవెలుగులు లోనికి పోనిస్తుంది;

వాళ్ళ శాశ్వత నివాసానికి దగ్గర చేరుతున్నకొద్దీ,

మనుషులు తమ బలహీనతల వల్ల, జ్ఞానవంతులౌతారు.

ఈ శరీరాన్నీ, ఈ లోకాన్నీ ఒకేసారి విడువ సమాయత్తమవుతూ

మరో కొత్తలోకాన్ని వాకిలి ముంగిలిలో నిల్చుని చూస్తుంటారు.

.

ఎడ్మండ్ వేలర్

3 మార్చి 1606 – 21 అక్టోబరు 1687

ఇంగ్లీషు కవి .

.

             Edmund Waller

3 March 1606 – 21 October 1687

.

Old Age

The seas are quiet when the winds give o’er;    

So calm are we when passions are no more.     

For then we know how vain it was to boast      

Of fleeting things, so certain to be lost.    

Clouds of affection from our younger eyes               

Conceal that emptiness which age descries.      

The soul’s dark cottage, batter’d and decay’d, 

Lets in new light through chinks that Time hath made:     

Stronger by weakness, wiser men become        

As they draw near to their eternal home.

Leaving the old, both worlds at once they view

That stand upon the threshold of the new.

.

Edmund Waller.

3 March 1606 – 21 October 1687

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900

Ed: Arthur Quiller-Couch, 1919

http://www.bartleby.com/101/306.html

“ముదిమి… ఎడ్మండ్ వేలర్, ఇంగ్లీషు కవి”‌కి ఒక స్పందన

  1. Cannot stop adding the lengthy comment as my notes is such: This reminds me of 3 other poems:
    బాలస్తావత్ క్రీడాసక్తః
    తరుణస్తావత్ తరుణీసక్తః
    వృద్ధస్తావత్ చింతాసక్తః
    ఏరమే బ్రహ్మణి కోపినసక్తః

    బాల్యంలో ఆటలయందు ఆసక్తితో, యౌవనంలో యువతి యందు ఆసక్తితో, వృద్ధాప్యంలో చింతలతో కాలక్షేపం చేసేస్తాడే గాని పరబ్రహ్మ యందు ఎవడునూ అనురక్తుడు కాడు కదా!?

    కొన్న కాంతలను కన్న బిడ్డలను
    వన్నె చీరలను వాన గుడిసెలను
    తిన్నగా కని దైవ లోకము-అని
    తన్నుకొళ్ళలో త్యాగరాజ నుత

    భార్య, పిల్లలు, ఇతర వస్తువులు, చివరకు పూరి గుడిసెలు అవే గొప్ప భాగ్యమనుకొని మురిసిపోతారు, పరమాత్మను ఎవరూ తలవరే!?

    బాల్యమందు శివునిఁ బరికింపఁగాలేరు
    యౌవనంబు నందు నరయలేరు
    ముదిమి యందుఁ గూడ మోసమే కందురో

    బాల్యమందు మనస్సు, చిత్తం ఇంకా అపరిశుద్ధం కాకపోవడం వలన ధ్యానం తేలిక. చిన్నప్పుడే దేవుని తెలుసుకోలేని వారు యౌవనంలో తెలుసుకోలేరు. ముసలితనంలో అంతకంటే తెలుసుకోజాలరు.

    శంకరాచార్య, త్యాగయ, వేమన కలిసికట్టుగా చెప్పారు మరిక…ఇందరి ఈ అనుభవసారమూ ఏమి చెయ్యాలి? మన వంతు కనువిప్పు వరకు ఆగక మునుపే అవగతం చేసుకోవాలి కాదా!?

    మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.