వీరుడు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి

“తను కోరుకున్నట్టుగా జాక్ వీరమరణం పొందాడు” అంది తల్లి,

తను చదువుతున్న ఉత్తరాన్ని మడిచిపెడుతూ.

“కలనల్ చాలా అద్భుతంగా రాస్తాడు,”

అలసిన ఆమె గొంతుకి ఏదో అడ్డుపడి గద్గదమైపోయింది.

సగం తలపైకెత్తి,” మా లాంటి తల్లులము

అటువంటి వీరపుత్రులను చూసి గర్వపడతాం.” ముఖం వాలిపోయింది. 

బ్రదర్ ఆఫీసరు మౌనంగా బయటకి నడిచేడు.

అతను ఆ అమాయకపు తల్లికి పెద్ద అబద్ధాలు చెప్పేడు

వాటిని, సందేహం లేదు, ఆమె జీవితకాలం నెమరువేసుకుంటుంది.

అతను మాటాడడానికి మాటలు వెతుక్కుంటూ, గొణుగుతుంటే,

ఆ ముసలి కళ్ళు ఆనందంతో,  ఏదో సాధించిన గర్వంతో మెరిసాయి:

అవును, ఆమె కొడుకు అంత సాహసి, ఖ్యాతితెచ్చిన కొడుకు.

అతను జాక్ ఎంత పిరికివాడో, పనికిమాలినవాడో గుర్తుచేసుకున్నాడు:

ఆ వికెడ్ కార్నర్ దగ్గర మందుపాత్రపేలినపుడు

ట్రెంచిలో ఎంతగాభరాపడ్డాడో; తనను ఇంటికిపంపేసేలా

ఎలా ప్రయత్నించాడో, చివరకి ఎలా చనిపోయాడో…

తునాతునకలిపోయి. ఎవరికీ పట్టినట్టు లేదు…

ఒక్క ఆ ఒంటరి ముదివగ్గు … తల్లికి తప్ప.! 

.

సీ ఫ్రై ససూన్

(8 September 1886 – 1 September 1967)

ఇంగ్లీషు కవి

.

Siegfried Sassoon
Siegfried Sassoon
Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm

.

The Hero

 

‘Jack fell as he’d have wished,’ the mother said,

And folded up the letter that she’d read.

‘The Colonel writes so nicely.’ Something broke

In the tired voice that quavered to a choke.

She half looked up. ‘We mothers are so proud

Of our dead soldiers.’ Then her face was bowed.

 

Quietly the Brother Officer went out.

He’d told the poor old dear some gallant lies

That she would nourish all her days, no doubt

For while he coughed and mumbled, her weak eyes

Had shone with gentle triumph, brimmed with joy,

Because he’d been so brave, her glorious boy.

 

He thought how ‘Jack’, cold-footed, useless swine,

Had panicked down the trench that night the mine

Went up at Wicked Corner; how he’d tried

To get sent home, and how, at last, he died,

Blown to small bits. And no one seemed to care

Except that lonely woman with white hair.

.

Siegfried Sassoon

(8 September 1886 – 1 September 1967)

English Poet

 

“వీరుడు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి” కి 3 స్పందనలు

  1. ఆర్మీలో తప్పక సర్వ్ చెయ్యాల్సివచ్చిన కాలంలో తన భయాలు, అందువలన తన కెరీర్ లో వచ్చిన అంతరాయాలు వంటివి ఒక ఇజ్రేయిలీ సహోద్యోగి చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. మీరు చూసి ఉండకపోతే Tae Guk Gi: The Brotherhood of War movie చూడండి. ఈ కవితలో వ్యక్తమైన భయాలతో పాటుగా వీర మరణాలు కూడా చూడొచ్చు.

    మెచ్చుకోండి

    1. ఉషారాణి గారూ,
      ఈ కవితలో నాకు అనిపించింది జాక్ ది వీరమరణమా కాదా అన్నప్రశ్న కంటే, ఆ ముసలి తల్లి మిగిలిన జీవితకాలం సంతృప్తిగా నెమరువేసుకుందికి బ్రదర్ ఆఫీసరు కల్పించి చెప్పిన అబద్ధాలు ఒక సైనికుని తల్లిపై మరో సైనికుడికి గల Concern. పోయిన జీవితాన్ని ఎలాగూ తీసుకు రాలేము గాని, ఉన్న జివితాన్నైనా సుఖంగా వెళ్ళదీసేట్టు చెయ్యవచ్చు. “న బ్రూయాత్ సత్య మప్రియం” అన్న మాట గుర్తుకు వస్తోంది.
      అభివాదములతో

      మెచ్చుకోండి

Leave a reply to Usha స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.