మనుషులు అతార్కికులు, అవివేకులు, స్వార్థపరులు.
అయినా సరే, వాళ్ళని ప్రేమించు.
నువ్వేదైనా మంచిపని చేస్తే దానివెనక నీకేదో స్వలాభం ఉందని నిన్ను నిందిస్తారు.
అయినా సరే, మంచిని చెయ్యి.
నువ్వు విజయం సాధించి నిజమైన శత్రువులనీ, కపట స్నేహితుల్నీ సంపాదించుకుంటావు.
అయినా సరే, విజయం సాధించు.
నువ్వు ఇవాళచేసిన ఉపకారాన్ని రేపటికి మరిచిపోతారు.
అయినా సరే, ఉపకారం చెయ్యి.
నిజాయితీవల్ల, నిజంచెప్పడం వల్ల నువ్వు నష్టపోవచ్చు.
అయినా సరే, నిజాయితీగా ఉండి నిజమే చెప్పు.
గొప్ప గొప్ప ఆలోచనలున్న గొప్ప గొప్ప స్త్రీ పురుషుల్ని
కొంచెపు ఆలోచనలున్న కొంచెపు స్త్రీ పురుషులు పడగొట్టొచ్చు.
అయినా సరే, గొప్పగానే ఆలోచించు.
ప్రజలు పీడిత జనులని ఆదరిస్తారు గాని, డబ్బున్న వాళ్ళనే అనుసరిస్తారు.
అయినా సరే, పీడితులకోసమే పోరాటం చెయ్యి.
నువ్వు దశాబ్దాలపాటు కష్టపడి నిర్మించినది ఒక్క రాత్రిలో ధ్వంసం అయిపోవచ్చు.
అయినా సరే, నిర్మించు.
ప్రజలకి సహాయం కావాలి గాని, నువ్వు చెయ్యబోతే నీ మీద దాడి చేస్తారు.
అయినా సరే, ప్రజలకి సాయం చెయ్యి.
నీ దగ్గరి అత్యంతవిలువైన వస్తువుని ప్రపంచానికి ఇయ్యి, నీ పళ్ళు రాలగొడుతుంది.
అయినా సరే, నీదగ్గర ఉన్న అత్యుత్తమమైన దాన్ని ప్రపంచానికి ఇవ్వు.
.
కెంట్ ఎం. కీత్
అమెరికను.
English Original: The Paradoxical Commandments
Kent M. Keith,
Contemporary American
This poem was written by Kent M. Keith in 1968 when he was a 19-year-old Harvard Student. Since then, it has been quoted by millions and even mistakenly attributed to Mother Teresa who had a version hung as a poem on a wall in her Children’s Home in Calcutta. The theme and the paradox is to persevere in doing good for humanity and acting with integrity even if your efforts aren’t appreciated.
This poem is a copyrighted work. Please click on the title underlined (linked) above to read the original.

Leave a reply to nmraobandi స్పందనను రద్దుచేయి