నెల: మార్చి 2014
-
ఆమె పేరు… వాల్టర్ సావేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
బ్లాజ్ఞ్మిత్రులకీ, సందర్శకులకీ జయ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకూ మీ కుటుంబానికీ, మీ మిత్రులూ శ్రేయోభిలాషులకీ ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలు కలుగజేయాలని కోరుకుంటున్నాను *** మెత్తని సముద్రపుటిసకమీద నీ పేరు నేను రాసున్నప్పుడు నవ్విన నీ నవ్వు నాకింకా గుర్తే! “ఏమిటది, చంటిపిల్లడిలా! నువ్వు ఏదో రాతి మీద రాస్తున్నాననుకుంటున్నావు!” ఆ క్షణం తర్వాత ఇయాంథే పేరు రాసేను ఏ కెరటమూ ఎన్నడూ చెరపలేనట్టుగా; భావి తరాలు విశాల సాగరంపై చదవగలిగేలా. . వాల్టర్ సేవేజ్ లాండర్…
-
పద్యం -38… ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి
నిన్న రాత్రి ఊరంతా తిరుగుతూ మట్టి కూజాలమ్మే దుకాణం దగ్గర ఆగేను, వాటిపక్కన నిశ్శబ్దంగా నిల్చున్న నేను, అవి ఇలా అనడం విన్నాను: ఎన్నో ఏళ్ళుగా మేము మా దారంట వచ్చిన లెక్కలేనంతమంది కుమ్మరుల, వ్యాపారుల ఆప్యాయపు స్పర్శకు పులకించాము. వాళ్ళందరూ అకస్మాత్తుగా నిష్క్రమించారు– మమ్మల్ని వదిలి మరి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళేరో ఏమో! . ఉమర్ ఖయ్యాం (18 May 1048 – 4 December 1131) పెర్షియను కవీ, తాత్త్వికుడూ, గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు.…
-
ముగింపు… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కి, అమెరికను
మనమందరం విరిసి ఉండవలసిన వేళలో విరియడానికి ఎన్నడూ తొందరపడని గులాబుల్లాంటి వాళ్ళమి ఎంతగా అంటే చివరికి సూర్యుడు కూడా ఎదురుచూసి చూసి విసిగెత్తిపోయేడేమోననిపిస్తుంది. . ఛార్ల్స్ బ్యుకోవ్ స్కి, ఆగష్టు 16, 1920 – మార్చి 9, 1994 జర్మన్-అమెరికను కవి . . Finish . We are like roses that have never bothered to bloom when we should have bloomed and it is as if the sun…
-
Unrelenting Drizzle… Nanda Kishore, Telugu, Indian
As the wind blows off the roof, I run after the wheeling palm leaves… The delight at the gust of rain-borne wind Evaporates in no time. As the waters enter the house, I try bailing out with utensils. The indulgence of rain drops Really takes me to my wit’s end. One should only…
-
మార్చలేనిదిగా మారు … రూమీ, పెర్షియన్ కవి
ఏ అద్దమూ మునపటివలె ఇనప పలకగా మారలేదు; ఏ రొట్టే తిరిగి గోధుమ గింజగా మారలేదు! సారాయి నుండి మళ్ళీ ద్రాక్షగుత్తులు నువ్వు సృష్టించలేవు, ఒక సారి త్రుంచిన పువ్వుని లతకి పూర్వంలా అతికించలేవు! తన కొలిమిలో జీవితాన్ని పరివర్తనలేని దానిగా మార్చనీ, భూమిమీద నిన్నొక అనశ్వరమైన వెలుగుకిరణంగా తీర్చనీ. . జలాలుద్దీన్ రూమీ 1207- 1273 ప్రముఖ పెర్షియన్ సూఫీ కవి. . . Change to the Unchangeable! . No mirror becomes…
-
విహారనౌక… వాల్టర్ సేవేజ్ లాండర్, ఇంగ్లీషు కవి
కడకు ఇక్కడ విశ్రమిస్తున్న ఈ ఓడ ఒకప్పుడు బలమైన పరుశువులూ, గావాయి గలది; గాలి ఎప్పుడు ఎలా వీచినా విహారానికీ, దూరయాత్రకీ సిద్ధంగా ఉండేది. ఇప్పుడంటే ఒక ప్రక్కకి ఒరిగి రికామీగా ఉంది గలగలపారుతున్న ప్రవాహంతో పరుగులెత్తడం మరిచి. అయినా, దీనికి గతవైభవపురోజులున్నై; అప్పుడు అందమైన పడుచులు పూలు తెచ్చి దీని ముందరితట్టునలంకరించి, తలవరుస శుభ్రపరిచేవారు కలలప్రపంచాల్ని తమతో మోసుకుపోతూ; కొన్ని వేల గాథలు చెప్పగలదిది… కానీ, మనసులో దాచుకోవడమే దానికి మహా ఇష్టం. ఓ నా చిన్నారి బాలికా!…
-
మంచి కవిత … తుకారాం, మరాఠీ కవి
ఒక మంచి కవిత రాజభవనంలో గోడకి కన్నం కనుక్కోడం వంటిది. ఎవడికి ఏమిటి కనిపిస్తుందో ఎవడు చెప్పగలడు? . తుకారాం 1577–1650 మహరాష్ట్ర భారతీయ కవి. . A Good Poem . A good poem is like finding a hole in the palace wall– never know what you might see. . Tukaram 1577–1650 Marathi, Indian.
-
Death Sentence … Viswanatha Satyanarayana, Indian
Telugu Original: Uri (Published in Anandavani) “You have sentenced me to death; and now ask me to say whatever I want to say. There would be some meaning if you had asked me before passing the sentence. Now, it makes no difference whether or not I say what I wanted to say. But there is…
-
కొండ పూలు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
వసంతంలో మల్లెల్ని అడిగాను అతని మాటలు నిజమేనా అని, చక్కగా, తెల్లగా విరబూచిన మల్లెలకి అన్నీ తెలుసు. పొలాలన్నీ బీడుపడి వివర్ణమయాయి భీకరమైన శరదృతుప్రభావానికి. ఇన్ని పారిజాతాలున్నాయి గాని, ఒక్కదానికీ తెలీదే! . సారా టీజ్డేల్, August 8, 1884 – January 29, 1933 అమెరికను కవయిత్రి . . Wild Asters . In the spring I asked the daisies If his words were true,…
-
సంతకం చేసిన హస్తం … డిలన్ థామస్, వెల్ష్ కవి
కాగితం మీద సంతకం చేసిన హస్తం ఒక నగరాన్ని పడగొట్టింది, సర్వాధికారాలు గల ఐదువేళ్ళూ ఊపిరిని కప్పం కట్టమన్నాయి ఒక దేశజనాభా సగానికి తగ్గించి, మృతులప్రపంచాన్ని రెట్టింపుచేసింది, ఈ ఐదుగురు రాజులూ, మరో రాజుని మట్టుపెట్టారు. ఆ శక్తిమంతమైన హస్తం వాటమైన భుజానికి చేర్చుతుంది వేళ్ళకణుపులు సున్నంతో బిరుసెక్కాయి; ఒక బాతు ఈక కలం హత్యల్ని పరాకాష్ఠకి తీసుకెళ్లింది అది వాక్స్వాతంత్ర్యానికి భరతవాక్యం పలికింది. ఒడంబడికపై సంతకం చేసిన హస్తం ఒక ఆవేశాన్ని రగిలించింది, కరువు విజృంభించింది,…