చిన్నతనం… ఫ్రాన్సిస్ కార్న్ ఫొర్డ్, ఇంగ్లీషు కవయిత్రి

ఓ రోజు మేడమెట్లనానుకున్న కటకటాల్లోంచి

మా పెద్దమ్మమ్మ’ఎట్టీ’ స్నేహితురాలు వెళ్ళిపోతున్నప్పుడు

ఆమె మెడలోని పగడాల దండతెగిపోడం చూసేదాకా…

నేననుకుంటూండేదాన్ని పెద్దవాళ్ళు

బిగువైన మెడలూ, ముక్కు చుట్టూ ముడుతలూ

చేతులమీద బాగా బలిసిన పాముల్లా నరాలూ

గొప్పగా కనిపించడానికి ఎంచుకుంటారేమోనని.

అవిదొర్లిపోతుంటే ఆమె వెదకడానికి తెగ అవస్థ పడింది.

అప్పుడు నాకు అర్థమయింది, ఆమె ముసలితనమూ

నా చిన్నతనమూ మా అధీనంలో లేనివని.

.

ఫ్రాన్సిస్ కార్న్ ఫొర్డ్

(30 March 1886 – 19 August 1960)

ఇంగ్లీషు కవయిత్రి

జీవితంలో కొన్ని సత్యాలు ఎంత అకస్మాత్తుగా అవగాహనకు వచ్చి, మనం గ్రాడ్యుయేట్ అవుతామో సూచించే చిన్న కవిత ఇది.

ఈమె చార్లెస్ డార్విన్ మనుమరాలు

.

Frances Cornford

.

Childhood

.

I used to think that grown-up people chose

To have stiff backs and wrinkles round their nose,

And veins like small fat snakes on either hand,

On purpose to be grand.

Till through the banister I watched one day

My great-aunt Etty’s friend who was going away,

And how her onyx beads had come unstrung.

I saw her grope to find them as they rolled;

And then I knew that she was helplessly old,

As I was helplessly young.

 .

Frances Cornford

30 March 1886 – 19 August 1960

English Poet

“చిన్నతనం… ఫ్రాన్సిస్ కార్న్ ఫొర్డ్, ఇంగ్లీషు కవయిత్రి” కి 2 స్పందనలు

  1. చాలా చక్కగా ఉంది…
    ఆత్మ ఇంగ్లీష్ దైనా
    తెలుగుతనమే చక్కగా ఉంది…
    అనువాద కళకి అద్దంలా…
    అనువాదమనే అనుమానం
    ఏ మూలా కలగకుండా…

    మొదటి సారిగా ఓ మిత్రురాలి
    రిఫరెన్స్ పుణ్యంగా మీ బ్లాగ్ చూశాను
    ఒక నిధి దొరికినట్లైంది…
    కృతజ్ఞతలు…
    మీ ఇరువురికి…

    మెచ్చుకోండి

    1. రావుగారూ,
      మీ సాదరపూర్వకమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు. మీకు నా బ్లాగుని సూచించిన మీ స్నేహితురాలికి కూడా.
      అభివాదములతో

      మెచ్చుకోండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.