నాకు బదులు ఈ స్మారక తిప్పని గుర్తుంచుకో,
అది ఉన్నది అందుకే. నా సహచరులని గుర్తుంచుకో,
వాళ్ల పేరు పెట్టిన వీధిని గుర్తుంచుకో,
బాగా పేరుపడ్డ భవనాన్ని గుర్తుంచుకో.
దేవుని పేర వెలిసిన ఆరాధన మందిరాన్ని గుర్తుంచుకో,
తోరాటోరాలోని వ్యాఖ్యానాలను గుర్తుంచుకో,
స్మృతిగీతాలని గుర్తుంచుకో,
చరిత్రని తమలో ఇముడ్చుకున్నరంగురంగుల జండాలను,
వాటిలో చుట్టబడిన అమరవీరుల దేహాలనూ గుర్తుంచుకో
అవి ఏనాడో మట్టిలో కలిసినై; ఆ మట్టిని గుర్తుంచుకో.
వాకిటముందు కళ్ళాపినీ, పునర్జన్మనీ గుర్తుంచుకో.
భూమిమీద పశుగణాలూ, ఆకాశంలోని విహంగాలూ గుర్తుంచుకో.
అన్నిటినీ గుర్తుంచుకుంటే, నేను ప్రశాంతంగా నిద్రిస్తా.
.
యెహుదా అమిఖాయ్
3 May 1924 – 22 September 2000
ఇజ్రేలీ కవి
[Notes: తోరాటోరా: బైబిల్‌లోని మొదటి ఐదు పుస్తకాలు (పెంటాటూక్). భారత దేశంలో వేదం వలె, ఆదిలో కంఠస్థం చేసి, వాటిని మౌఖికంగా ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందిస్తుండేవారు. యూదుల నిత్య నైతిక జీవితానికీ, పారమార్థికానికీ కూడా సంబంధించిన అంశాలు ఇందులో ఉన్నాయి. వీటికి వ్యాఖ్యానం చేసేవారు గురువులు. ‘‘రాబై’’ అని వారిని వ్యవహరించేవారు. వారు చర్చించి, కొన్ని వ్యాఖ్యానాలను రూపొందించారు. ఇవి కూడా చాలా భాగం మౌఖికంగానే ఉండేవి. ఐతే, క్రీ. శ. 70లో యెరుసలేము ఆలయ విధ్వంసం తరువాత అక్కడ అంతవరకు భద్రపరచిన శాసనాలకే అస్తిత్వం లేకుండాపోయింది. కనుక లిఖితంగా శాసనాలను భద్రపరచు కొనవలసిన అవసరం ఏర్పడింది. క్రీ. శ. 200 సంవత్సరం వచ్చేసరికి లిఖిత సాహిత్యం తగినంతగా లభ్యం అవుతూ వచ్చింది. ఇందులో శాసనాలకు వ్యాఖ్యానాలు, కొన్ని ముఖ్యమైన తీర్పులు కూడా ఉన్నాయి.
(Courtesy: http://www.andhrabharati.com/dictionary/index.php)%5D
వ్యాఖ్యానించండి