జరుగుతున్న పొరపాట్లకి
నా తల బద్దలుకొట్టుకోవడం మాని
ప్రతి తెరవని తలుపు వెనకా ఒక రాజీమార్గం
దాగుంటుందని తెలుసుకునే వేళకి;
జీవితాన్ని కళ్ళల్లోకళ్ళుపెట్టి చూసి, నెమ్మదించి,
ప్రాప్తకాలజ్ఞత అలవరచుకునే వేళకి
జీవితం నాకు సత్యాన్ని ఆవిష్కరిస్తుందేమో గాని
ప్రతిగా, నా యవ్వనాన్ని పూర్తిగా లాక్కుంటుంది.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి
ఈ కవితలో ప్రకటించిన సత్యం అందరికీ తెలిసినదే… మనం సత్యాన్ని అవగతం చేసుకునే వేళకి జీవిత చరమాంకంలోకి వచ్చెస్తాం… ఆ సత్యం యవ్వనంలో ఉన్నప్పుడు అవగతమైతే బాగుణ్ణుకదా!. అది ప్రకృతి కల్పనకి విరుద్ధం. దాన్నే తనదైన శైలిలో చెప్పింది సారా టీజ్డేల్.
అమెరికను కవయిత్రులలో అత్యంత ప్రతిభాశాలీ, హృదయ సౌకుమార్యమూ, కవిత్వాన్ని అతి చిన్నపదాలలో చొప్పించి చెప్పగల నేర్పూ కల కవయిత్రి.
.

వ్యాఖ్యానించండి