ఇది శిశిరం; బయట ప్రకృతిలో కాదు,
నా మనసులోనే ఉన్నది…ఈ అచేతన.
యవ్వనం, వసంతమూ నన్నుఆవరించి ఉన్నా
ఇక్కడ వయసు మీరినది కేవలం నేనొక్కడినే.
.
పక్షులు గాలిలో రివ్వునదూసుకుపోతున్నాయి,
పాడుకుంటూ, విరామంలేక గూడుకట్టుకుంటూ;
నలుదిక్కులా జీవం సందడిస్తోంది
ఒక్క నా మనసులో తప్ప.
.
అంతా నిశ్శబ్దం; ముదురాకులు
గలగలా రాలి కదలకుండా పడున్నై;
ధాన్యం నూరుస్తున్న చప్పుళ్ళు వినరావు
మిల్లు కూడా మూగపోయింది.
.
HW లాంగ్ ఫెలో
(February 27, 1807 – March 24, 1882)
అమెరికను
.

వ్యాఖ్యానించండి