Who carks for the creed of lords of music? … Samala Sadasiva, Telugu Indian

Painting of the Goddess Saraswati by Raja Ravi...
Painting of the Goddess Saraswati by Raja Ravi Varma (Photo credit: Wikipedia)

This was an anecdote recounted by KD Dikshit, who worked in AIR before partition days; an anecdote that opens up the eyes of people who assume the mantle of great singers doing some diploma or degree from some music college; an anecdote that demonstrates only those that devoutly practice music … like tapas… can catch the pulse of a ‘note’ but not everybody and anybody:

In 1947 Ustad Bade Ghulam Ali Khan used to visit India on Visa to perform before the admirers of his music. Naturally, the AIR people were eager and tried desperately to record his voice but he never allowed them in the normal course. Even if he did, he used to feel suffocated in the  AC recording studios. “Open the windows,” he often used to shout at them. 

 
KD Dikshit, Program Producer of AIR, Bombay and who had a smack of classical music, somehow got the wind that Ustad Bade Ghulam Ali Khan was staying with one of his friends in Mahim. He rushed to his presence immediately and was able to get a nod from him to record his voice. In Studio number 5 they painted windows and to make believe they were real, they even drew the curtains about them. When Ustad entered the studio they opened the window curtains. After he got thoroughly satisfied, Ustad recorded some Ragas

    
When Ustad came out and was about to  occupy the car,  they overheard from Studio number 2  a recording of an aalaap by some singer. It looked like Bheempalasi Alaap to Dikshit.  Enthusiastic to make his familiarity with classical music known to Ustad, Dikshit remarked, “Ustaad! Somebody is rendering the aalaap of Bheempalasi.”  

   
“No. my child! That’s not Bheempalasi.  Did you notice the “Gandhaar“? This Gandhaar belongs to Mal Kauns and not to Bheempalasi,” said Ustad. Dikshit was rather confounded when Ustad said it was Mal Kauns whereas he was able to notice the Bheempalasi so clearly. All along the way, Ustad delineated to Dikshit the different shades of Gaandhaar from different Ragas. Immediately after coming to studio Dikshit cross-checked the Raga the artist had recorded. It was indeed Mal Kauns.

 
Blessed are the people who could visualise ‘notes’ in all their hues, and they belong to the creed of Rishis who visualise the truth.

Once when Ustad  Bade Gulam Alikhan gave his maiden performance in Madras City, the great GN Balasubrahmaniam honoured Ustad with a woolen shawl and bowed at his feet, the musical fraternity present in the hall were stunned and felt jealous. But at the end of the performance, they themselves bowed before him and admired the noble gesture of GNB.

 
Who carks for the creed of the tongue, which unveils Goddess Saraswati?

.

Samala Sadasiva

Telugu Indian

Image Courtesy: http://1.bp.blogspot.com/
Image Courtesy: http://1.bp.blogspot.com/

.

సంగీత కులీనులకు కులమేల?

.

దేశవిభజనకు పూర్వం నుంచి ఆలిండియా రేడియోలో పనిచేసిన  కె డి దీక్షిత్  చెప్పిన ముచ్చట; సంగీత సాధన ఏ సంగీత  విద్యాలయంలోని డిప్లమో కోసమో, డిగ్రీ కోసమో చేసి గాయకులమనిపించుకునేవాళ్ళకు కనువిప్పు కలిగించే ముచ్చట; కఠోర తపస్సులాంటి సాధన చేస్తేనే తప్ప  స్వరసాక్షాత్కారం  సాధ్యం కాదని చేప్పే ముచ్చట: 

 
1947లో  ఉస్తాద్ బడే గులామలీ ఖాన్ భారతీయ శ్రోతలకు తన సంగీతాన్ని వినిపించడానికి వీసామీద మన దేశానికి వచ్చేవాడు. సహజంగానే రేడియో స్టేషన్ల వాళ్ళు అతని సంగీతాన్ని రికార్డు చేసుకోవడానికి  పలురకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు. సాధారణంగా  అతడు సమ్మతించేవాడు కాదు. సమ్మతించినా రికార్డు చేసే  ఏ సీ స్టూడియోల్లో  అతనికి ఊపిరి ఆడేది కాదు. “కిటికీలు తెరవండి” అని ఆదేశించేవాడు.

 
బొంబాయినగరంలోని  మాహిం లో  ఎవరింటనో ఉస్తాద్ బసచేసి ఉన్నాడని తెలుసుకున్న ప్రోగ్రాం ప్రొడ్యూసర్, శాస్త్రీయ సంగీతంలో  తగుమాత్రం పరిచయం వున్న దీక్షిత్ అతని సన్నిధికి వెళ్ళి  ఎలాగో రికార్డు చేయించడానికి ఒప్పించేడు. ఐదవ నంబర్  స్టూడియోలో కిటికీలు చిత్రించబడి ఉన్నాయి. అవి నిజంగా కిటికేలే  అని భ్రమింపజెయ్యడానికి  వాటికి తెరలుకూడా వేసినారు. ఆ స్టూడియోలో  ఉస్తాద్ ప్రవేశించగానే  తెరలు తొలగించినారు.  ఉస్తాద్ సర్వవిధాల సంతుష్టుడై కొన్ని రాగాలు రికార్డు చేయించినాడు.  

స్టూడియో వెలుపలకు వచ్చి కారులో కూర్చుండబోతూండగా రెండవ నంబర్ స్టూడియోలో ఎవరో గాయకుడు చేయిస్తున్న అస్థాయి వినిపిస్తున్నది.  అది భీంపలాసి ఆలాపనలా ఉన్నది. తన సంగీత శాస్త్ర పరిచయాన్ని ఉస్తాద్ గ్రహించాలని  కెడి  దీక్షిత్ “ఉస్తాద్! ఎవరో భీం పలాసీ రాగాలాపన చేస్తున్నారు ‘ అన్నాడు.

 
‘కాదు బేటా! అది భీం పలాసీ కాదు. గాంధార్ స్వరం వింటున్నావు కదా. ఈ గాంధార్  మాల్ కౌంస్ ది కాని భీం పలాసీ ది కాదు,” అన్నాడు.  భీం పలాసీ  స్వరూపం అంత  స్పష్టంగా కనిపిస్తుంటే అంతటి ఉస్తాద్ కాదంటాడేమిటి? అనే ఆశ్చర్యంతో  ఉస్తాద్ వెంట  కారులో మాహిం వెళ్ళాడు  దీక్షిత్. మాహిం చేరే వరకూ  ఉస్తాద్ కారులోనే  ఏ రాగం గాంధార్ ఎలా ఉంటుందో వినిపించినాడు.  స్టూడియోకి వచ్చి దీక్షిత్ వాకబుచేస్తే  ఆ గాయకుడు రికార్డు చేయించిన రాగం మాల్ కౌంస్.

స్వరసాక్షారం పొందినవాళ్ళు  సత్యదర్శనం చేసిన ఋషులకోవకు చెందినవాళ్ళు. మద్రాసు మహానగరాన మొట్టమొదట ఉస్తాద్ బడెగులామలీఖాన్ పాటకచేరీ జరిపినప్పుడు  మహాగాయకుడు జి. ఎన్. బాలసుబ్రహ్మణ్యం శాలువా కప్పి  సన్మానించి పాదాభివందనం చేయగానే ఆ సభలో సమావిష్టులైన సంగీతవేత్తలు  కంటకించుకున్నారు. పాటకచ్చేరీ ముగిసినతర్వాత  నతమస్తకులై నమస్కరించి జి. ఎన్. బి. ప్రదర్శించిన ఔచిత్యాన్ని మెచ్చుకున్నారు.

ఏ నోట సరస్వతి సాక్షాత్కరిస్తుందో ఆ నోరుగల వ్యక్తి కులమెవరికి కావాలె?

.

సామల సదాశివ

మలయమారుతాలు నుండి.

“Who carks for the creed of lords of music? … Samala Sadasiva, Telugu Indian” కి 4 స్పందనలు

  1. మాస్టారూ… ఎంత కాలానికి ఎంత కాలానికి..!
    చిన్న సందేహం… శీర్షికలోని carks సరియేనా? లేక cares అనబోయి టైపాటు బారిన పడ్డారా? వ్యాసాంతంలోనూ అదే స్పెల్లింగ్‌ ఉపయోగించారు కదా..

    మెచ్చుకోండి

    1. Thank you Phaneendra garu. Carks is correct. It means the same as cares but has that shade of meaning of treating it as insignificant. Nobody really bothers about the caste or creed of great people. As the sanskrit Sloka goes “Ayam nijah parOvEti gananaa laghucEtaSAm” .
      As the artist grows he becomes a universal property.
      Thank you very much.

      మెచ్చుకోండి

Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.