ఎడబాటు… డబ్ల్యూ ఎస్ మెర్విన్, అమెరికను కవి.

సూదిలోంచి దారం దూరినట్టి


నీ ఎడబాటు నా గుండెను దూసుకుపోయింది.


ఇక నా చేతలన్నీ, ఆ రంగుతో అద్దినవే.


.

డబ్ల్యూ ఎస్ మెర్విన్

(September 30, 1927)

అమెరికను కవి

కొన్ని కవితల క్లుప్తతే వాటి ప్రాణం. అంతే కాదు, కొందరు కవులు ఎంచుకునే ఉపమానాలు చాలా గడుసుగా ఉంటాయి. పైకి చెప్పిన మాటకంటే, ఉపమానంద్వారా వాళ్ళు అందించే భావం ఉన్నతంగా, సున్నితంగా ఉంటుంది. ఉదాహరణకి, ఈ కవితలో నీ ఎడబాటు నా గుండె దూసుకుపోయింది అన్నది అందరూ సామాన్యంగా చెప్పే మాటలే. అయితే కవి ఇక్కడ ఒక గడుసైన ఉపమానం వాడేడు. సూదిలో దారం ఎక్కినట్టు అని. అలా చెబుతూ, మన ఆలోచనని దారంవైపే నిలబెట్టేడు. కానీ చెప్పదలచుకున్నది దారం ఎక్కడం కాదు. సూదికున్న రంధ్రంలా, నీ ఎడబాటు నా హృదయానికి ఒక రంధ్రం చేసిందని. ఇక జీవితమంతా ఆ రక్తిమే… అని కవి భావము.

.
Separation

.
Your absence has gone through me
Like thread through a needle.
Everything I do is stitched with its color.
.
W S Merwin
(born September 30, 1927)
American Poet

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2002/10/separation-w-s-merwin.html