
వాళ్ళు అంటున్నారు హెరాక్లైటస్! వాళ్ళంటున్నారు ఇక నువ్వు లేవని.
భరింపశక్యంకాని వార్త మోసుకొచ్చేరు వాళ్ళు వినడానికీ, ఏడవడానికీ;
మనిద్దరం ఎన్నిసార్లు మనమాటలతో సూరీడ్ని విసిగించి,నింగి వీడేదాకా
మాట్లాడుకున్నామో తలుచుకుని తలుచుకుని కన్నీళ్ళు కార్చేను.
ఇప్పుడు నువ్వు నిద్రిస్తున్నావు, నా ప్రియమైన కేరయాన్ అతిథీ!
ఒక పిడికెడు బూడిదై, ఎన్నాళ్లనుండో, ప్రశాంతంగా.
అయినా, నీ మధురమైన స్వరాలు, నీ కోయిలలు మేలుకున్నయిలే
మృత్యువు దేన్నైనా హరించగలదేమో గాని, అవి దాని తరం కాదు.
.
విలియం జాన్సన్ కోరీ
(January 9, 1823 – June 11, 1892)
ఇంగ్లీషు కవి
.

వ్యాఖ్యానించండి