ఎవరో అనామక… జాన్ బానిస్టర్ టాబ్, అమెరికను

.

ఎవరో అనామక… నిజానికి పేరెందుకు,

వెచ్చగా, కొత్తగా సుగంధాలు వెదజల్లుతూ,

వెలుగులీనే ఈ జ్వాల ప్రభవించిందని

ఆ రహస్యాన్ని విప్పిచెప్పడానికి ?

అలాగే, తన వచ్చిన పని ముగించుకుని,

దైవం దానిని గమనించి, అనుగ్రహించేక,

ఆ తనువుపై కీర్తిచంద్రిక ప్రకాశించేక,

పేరు లేకపోతేనేం? ఏ పేరూ లేకపోతేనేం? 

(అలాగే, దైవం తనపని ముగించుకుని

తన సృష్టిని ఒకసారి పరిశీలించి, తృప్తిచెందేక

తన వైభవం ఆ బొమ్మలో ప్రకాశించేక

పేరు లేకపోతే నేం? ఏ పేరూ లేకపోతే నేం?)

.

జాన్ బానిస్టర్ టాబ్

(March 22, 1845 – November 19, 1909)

అమెరికను

కవీ, ఆంగ్ల ఆచార్యుడూ, రోమను కేథలిక్కు మతబోథకుడు

[వివరణ:

His అన్న పదం భగవంతునికి సర్వనామంగా ఇంగ్లీషులో రాయడం అనూచానంగా వస్తున్నది. రెండవ పద్యంలో అది అచ్చుతప్పయిఉంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే, భగవంతుడు తనుచేసిన బొమ్మ చూసి తను మురిసిపోతున్నట్టు కవి ఇక్కడ రాసి ఉంటే, ఈ కవితలో అంతగా నాకు గొప్పదనం కనిపించలేదు. అదే భగవంతుడు తను సృష్టిచేసిన వస్తువు, తన చింతనని వ్యాప్తిచేసేలా ప్రవర్తించినపుడు కలిగే ఆనందం వేరు. మొదట చెప్పిన విషయంలో భగవంతుని సృష్టి, నేర్పూ మాత్రమే ఉన్నాయి. భగవంతుడు సర్వశక్తిమయుడన్నప్పుడు అతని సృష్టిచేసిన వస్తువు అందంగా, గొప్పగా ఉండడంలో గొప్పదనమూ, విచిత్రమూ లేదు. కాని, తను సృష్టిచేసి వదిలేసిన వస్తువు, తనంత తానుగా ప్రవర్తిల్లగల స్వేచ్ఛ ఉన్నప్పుడు, తన అభిమతానికి అనుగుణంగా ప్రవర్తించగలగడం తప్పకుండా అతనికి ఆనందాన్నిచ్చే విషయమే… మన పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేక మనం మురిసిపోయినట్టు.  అందుకనే నా అభిప్రాయానికి అనుగుణంగా రెండో పద్యం అనువాదం చేసి, బ్రాకెట్లలో దానికి రెండో ఊహప్రకారం అనువాదం ఉంచేను]

చాలా సరళమైన భాషలో గొప్ప తాత్త్విక సత్యాన్ని చెప్పేడు కవి. నిజానికి మన శరీరం అనబడే కట్టెకి ఏ పేరుంటేనేమిటి? అసలు పేరులేకపోతే నేమి? అది చెయ్యవలసిందల్లా దైవం దాన్ని ఎందుకు సృష్టించేడో  అది దైవం మెచ్చుకునేలా చెయ్యడం. అంతే! దైవం ఉనికి అంగీకరించనివాళ్లుకూడా చెప్పేది ఒక్కటే. ప్రవర్తన.

ఇక్కడ మతం, జాతి, కులం అనేవి ఏవీ దైవం సృష్టించినవీ, ఆశించినవీ కావు. ఇక్కడ నడవడికే ప్రాధాన్యత తప్ప, పేరుకీ, దాని అనుబంధవిషయాలకీ కాదు అని కవి చాలా స్పష్టంగా, సున్నితంగా, నేర్పుగా చెప్పినట్టు నాకు అనిపిస్తోంది.

.

Anonymous
.

Anonymous—nor needs a name
To tell the secret whence the flame,
With light, and warmth, and incense, came
A new creation to proclaim.

So was it when, His labor done,
God saw His work, and smiled thereon:
His glory in the picture shone,
But name upon the canvas, none.

.

John Banister Tabb

(March 22, 1845 – November 19, 1909)

American Poet, Roman Catholic Priest, and Professor of English.

“ఎవరో అనామక… జాన్ బానిస్టర్ టాబ్, అమెరికను” కి 2 స్పందనలు

  1. నేములో నేమున్నది అన్నాడు కదా షేక్స్పియర్… 🙂

    మెచ్చుకోండి

    1. Dear Phaneendra garu,

      నేములో నేమున్నది … Well said.

      Half of the world evils revolve around our name and our craving to immortalize it… knowing pretty well that it is impossible. Every generation thinks it can achieve the absurd and the impossible that their earlier generations failed.

      మెచ్చుకోండి

Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.