శోకం… ఎడ్న సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను

పిల్లలూ, వినండి:

మీ నాయన చనిపోయేడు.

అతని పాత కోట్లు తీసుకుని

వాటితో మీకు జాకెట్లు కుడతాను;

అతని పొడుగాటి పేంట్లనుండి

మీకు చిన్న పేంట్లు కుడతాను.

అతని జేబుల్లో

పొగాకు మరకలుపడి

అతను అక్కడపెట్టే వస్తువులుంటాయి

తాళం చెవులూ, చిల్లరడబ్బులూ…

చిల్లర డబ్బులు డాన్ కి

తన కిడ్డీబేంకులో దాచుకుందికి;

తాళాలు మాత్రం ఏన్ కి

చప్పుడుచేసుకుంటూ ఆడుకుందికి.

జీవితం కొనసాగవలసిందే

మరణించినవారిని మరిచిపోవలసిందే;

ఎంత మంచివాళ్ళు చనిపోయినా

జీవితం కొనసాగవలసిందే;

ఏన్, పద, నీ బ్రేక్ ఫాస్ట్ కానీ;

డాన్, ఈ మందు తాగు;

జీవితం కొనసాగవలసిందే

ఎందుకో మరిచిపోతుంటాను.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే.

.

Portrait of Edna St. Vincent Millay (1933-01-14)

.

ఈ కవిత ఎంత అపురూపమైనదో చెప్పనక్కర లేదు. ఈ కవిత నేను సుమారు నలభై సం వత్సరాల క్రింద చదివేను. అప్పటికి ఈ కవయిత్రి గురించికానీ, ఇంగ్లీషు సాహిత్యంతో గాని పెద్దగా పరిచయం లేదు. కానీ, చాలా సరళమైన భాషలో రాయబట్టి నాకు ఇట్టే అర్థమయి మనసులో గుర్తుండిపోయింది. మొన్నీమధ్యనే మా ఇంట్లో రాత్రి భోజనాల సందర్భంలో ఏదో ప్రసక్తి వస్తే ఈ పద్యం ఉదహరించాను కవిపేరు చెప్పలేక. చిత్రంగా రెండురోజుల క్రితం మా మిత్రుడు తనకీపద్యం నచ్చిందని నాకు mail చేశాడు. నా అభిమాన కవయిత్రిదని తెలియగానే ఎంతసంతోషం వేసిందో చెప్పలేను.

ఇంటియజమాని పోయినపుడు, ఆ బాధని తనే అనుభవిస్తూ, పిల్లలపై తన శోకప్రభావాన్ని పడనీయక వాళ్ళని పెంచడానికి స్త్రీకి బోలెడంత మానసిక శక్తి కావాలి. అంతవరకు అబలలా కనిపించినా, ఇటువంటి హఠాత్పరిణామం సంభవించినపుడు ధైర్యంగా నిలదొక్కుకున్న స్త్రీలని ఎంతమందినో చూసేను. ఎంత మంచివాళ్లు చనిపోయినా జీవితం ఆగకుండ కొనసాగవలసిందే అన్న చింతనని చాలా ప్రతిభవంతంగా ఈ కవితలో సూచించింది కవయిత్రి అనిపిస్తుంది నాకు

.

Lament

.

Listen, children:

Your father is dead.

From his old coats

I’ll make you little jackets;

I’ll make you little trousers

From his old pants.

There’ll be in his pockets

Things he used to put there,

Keys and pennies

Covered with tobacco;

Dan shall have the pennies

To save in his bank;

Anne shall have the keys

To make a pretty noise with.

Life must go on,

And the dead be forgotten;

Life must go on,

Though good men die;

Anne, eat your breakfast;

Dan, take your medicine;

Life must go on;

I forget just why.

.

Edna St. Vincent Millay

American

Poem Courtesy:  http://www.americanpoems.com/poets/ednamillay/7304

2 responses to “శోకం… ఎడ్న సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను”

  1. జీవితం కొనసాగింపు అత్యవసారాన్ని గురించి ఎంత చక్కని భాషలో ఆ తల్లి పిల్లలకు చెప్పిందండీ! హృదయాన్ని కదిలించింది మూర్తి సార్! ధన్యవాదాలు

    మెచ్చుకోండి

    1. Rao garu,

      This is indeed one of the finest poems I read when I was a student. It touched me instantly.

      with best regards,

      మెచ్చుకోండి

Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.