ఒక నాటు రోడ్డు ప్రక్క దృశ్యం… మేరీ లూయిజ్ హెర్సే అమెరికను

ఈ “కేప్ కాడ్” ఆకాశం క్రింద

ప్రతి పొలం పక్కనా, రాతిమడుగు పక్కనా

కళ్ళులేని ముఖంలా పదే పదే ఎదురౌతున్న

శుష్కించిన గాదెలు చూస్తున్నా.

.

ఎండకీ ఎండి, వానకి తడిసి, మట్టికొట్టుకుని

రాటుదేరిన నిర్మలంగా చూసే పిల్లల్ని పిలిచే

పని పాట్లతో గరుకెక్కి, గంతలుబడిన

ఆ స్త్రీ చేతుల్ని నేను మరువలేను.

.

సౌందర్యమూ, శ్రమా ఒకే ‘కాడి’కి జతకూర్చినట్టు

అటు బొద్దుగా, గుండ్రంగా

దిసమొలతొ పిల్లలూ

ఇటు వంగి కృషిచేస్తున్న కర్షకస్త్రీలూ.

.

మేరీ లూయిజ్ హెర్సే

అమెరికను

.

Country Road
.
I can’t forget a gaunt grey barn
Like a face without an eye
That kept recurring by field and tarn
Under a Cape Cod sky.

I can’t forget a woman’s hand,
Roughened and scarred by toil
That beckoned clear-eyed children tanned
By sun and wind and soil.

Beauty and hardship, bent and bound
Under the self-same yoke:
Babies with bare knees plump and round
And stooping women folk.
.
Marie Louise Hersey
American

[Poem courtesy: Anthology of Massachusetts Poets. 1922   Ed: William Stanley Braithwaite, (1878–1962).]

“ఒక నాటు రోడ్డు ప్రక్క దృశ్యం… మేరీ లూయిజ్ హెర్సే అమెరికను” కి 2 స్పందనలు

  1. చక్కటి తెలుగు నుడికారాలతో అందంగా ఉన్నది మాస్టారూ

    మెచ్చుకోండి

    1. స్వామి గారూ,

      మీ అభిమాన పూర్వక వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      అభివాదములతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: