Confessions… Srinivas Vasudev, Telugu, Indian Poet
2 responses to “Confessions… Srinivas Vasudev, Telugu, Indian Poet”
-
మూర్తిగారూ కృతజ్ఞతలు! నా కవితకి ఏదైనా పరమార్ధం ఉంటే అది ఇప్పుడె తెలుస్తోంది. మీ అనువాదం చదువుతున్నంతసేపూ అది నా పద్యానికి అనువాదంలా కాక అదె ఒరిజినల్ పద్యంలాగనే చదువుకుని ఆస్వాదించగలిగాను. ఇక మిగిలిన పాఠకుల సంగతి ఊహించగలను. ఈ అనువాదం నాకు ఓ పాఠంలాంటిది. నా కవిత మీ అనువాదానికి నోచుకున్నందుకు మళ్ళీ ధన్యవాదాలు
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
శ్రీనివాస్ గారూ,
మీ సౌహార్ద్రపూర్వక వ్యాఖ్యకి కృతజ్ఞతలు. కవితకి పరమార్థం పాఠకుడిని కదిలించడమే. పాఠకుడికి కవి చెప్పిన వస్తువుతో సమానమైన అనుభూతి అయినా ఉండాలి, కవిపొందిన అనుభూతి సంభావ్యత (Probability) కంటే సంభవత (Possibility)కి దగ్గరగా ఉన్నట్టైనా అనిపించాలి. ఒక పాఠకుడిగా మీ కవితని అనుభూతి చెందగలిగేను. మూలం చదివి మనసులో ఏర్పరచుకున్న చిత్రం ఒక అనుకరణ అయితే, అనువాదం ఎప్పుడూ దానికి భాషాపరమైన రూపమివ్వడం గనుక అనుకరణకి అనుకరణ లాంటిది. అంటే, చిన్నపిల్లడు బొమ్మను చూసి బొమ్మ వెయ్యడంలాంటిది. మూలభాషతెలియనివాళ్లకి ఏ మాత్రం రేఖామాత్రంగానైనా మీ ఆలోచనల అనుభూతిని అందించగలిగినా సంతోషమే.
మీకు నా ధన్యవాదాలు, అభినందనలు.
అభివాదములతో
మెచ్చుకోండిమెచ్చుకోండి

వ్యాఖ్యానించండి