Three cheers to Life! … Narayanaswamy Venkatayogi, Indian Poet

Lads!

This is your granny appealing

with folded hands

I swear up on me

Please don’t part with yourselves

for nothing.  

                                                                         

There are no more tears left

and I am frail, can’t wail bitterly; 

 

I am unable to stand

when you turn lifeless before my very  eyes  

instead of becoming mighty spears;

 

My heart rends

when children afire like live coals

reduce to cinders at the fireplace; 

 

Will you leave me destitute

who nursed you to the last drop

of my dried up breast?

 

Before bashing the beast

that enslaved us?

 

Lads!

Tell me, why should you die,

while people taking others’ lives      

shamelessly roam around?

Callow youth like tender teak leaves, 

why should you wither and dry up first?

Green horns Like the young mangoes                  

why should you drop down ?

Like the glitter on the waters

why should you disappear?

 

Children!

Don’t lose heart!

Don’t lose faith on life!

Plant your feet firm on the ground!  

 

Feel the spirit of these throbbing veins

on my hands.

Remember the anger of our people

who fought with guns and won.

 

Children!

Why do you waste away

your youthful vigor ?

And put out with waters of death

your fiery anger of a burning kiln?  

 

These ropes are twined

not to work as noose around your neck, 

but to bind and bang the wild elephants

that have been trampling us all the while.

The kerosene cans are not meant            

for you to douse and take lives,

but to burn those bastards in public

who have robbed us of all that we have.

 

Come on! Children!

Let’s unite and stay together.

Clap together and raise our voice

Let’s give three cheers to life

That the earth and heaven reverberate with:

“The Future is Ours”.

.

Narayana Swamy Venkatayogi.

.

Image Courtesy: Narayanaswamy Venkatayogi
Image Courtesy: Narayanaswamy Venkatayogi

Narayanaswamy Venkatayogi hails from Siddipet in Andhra Pradesh and is now living in Princeton, NJ US with wife Vidya and two daughters Tuhina and Tushira. He is Working in IT. He has so far published two collections of his  poems “Kallola Kala Megham”  and “Sanduka” His interests are:  Literature – particularly Poetry, Criticism; Serious Cinema and Film making. He loves music too!

While the politicians play emotions for their power, the innocent students and youth are the victims taking the slogans on their face value. This is more or less a phenomenon in India. While the cunning and aged politicians comfortably lodge themselves in seats of power, promising youth lies in dust for nothing. In the present poem a granny lamenting over the thankless sacrifices of the youth appeals to them to take a different course to avenge exploitation instead of taking their own lives in haste.

.

 బతుకు జిందాబాద్

 

బిడ్డలాలా!

మీ అవ్వను

చేతులు జోడిస్తున్న

నా తోడే

మిమ్మల్ని మీరు చంపుకోకుండ్రి

 

ఏడ్సెతందుకు నీల్లు లేవు నా కంట్ల

మొత్తుకునెతందుకు సత్తువలేదు నా ఒంట్ల

 

బరిసెలు గావల్సినోల్లు

నా కండ్ల ముందె

కట్టెలవుతుంటె వశపడుత లేదు

 

నిప్పులసుంటి కొడుకులు

నట్టింట్ల బూడిదైతుంటె

పానమాగుత లేదు

 

ఎండిన రొమ్ములకెల్లి

జీవం పిండి పోసిన

సేతికందకుంటనే ఎల్లిపొతర

 

బాంచెననిపించుకున్నోన్ని

బండకు కొట్టందే బతుకు సాలిస్తర

 

బిడ్డలాల మీరెందుకు సావాలె

బతికెటందుకు హక్కు లేనోల్లు

బాజాప్త తిరుగుతుంటె

లేత మోదుగాకులసుంటోల్లు

మీరెందుకు ఎండిపోవాలె

పచ్చని మామిడిపిందెలసుంటోల్లు

మీరెందుకు రాలిపోవాలె

నీల్ల మీద వెలుగసుంటోల్లు

మీరందుకు మాయమవాలె

 

బిడ్డలాల

ఆశ విడువొద్దు

బతుకు మీద బరోస ఇడువొద్దు

నేల మీద కాల్లు గట్టిగుండాలె

 

నా పెయ్యి మీద తేలిన నరాలు చూడుండ్రి

ఉబ్బిన నరాలల్ల పొంగిన పోరాటం చూడుండ్రి

గన్నుల తోటి కొట్లాడి గెల్సిన

మనోల్ల రేషం చూడుండ్రి

 

మీరెందుకు బిడ్డా

కోడెలాగసుంటి మీ వయసుని

పానంలేని కట్టెను జేస్తరు

ఎర్రటి కొలిమసుంటి మీ కోపంమీద

సావునీల్లు జల్లుతరు

 

బిడ్డలాలా

 

తాల్లు పేనింది

మీ కుతికెలకేసుకునెటందుకు గాదు

మనని తొక్కే మదపుటేన్గల్ని

కట్టి నేలక్కొట్టెతందుకు

 

గాసునూనె డబ్బాలు

మీ మీద పోసుకుని

నిండుపానం తీసుకునెటందుకు గాదు

మనకున్నదంత ఊడ్సుకున్న

బడాచోర్లను నడి బజార్ల నిలబెట్టి భగ్గుమనిపిచ్చెటందుకు

రాండ్రి బిడ్డలాల

ఒక్కటవుదాం ఒక్కటిగుందాం

చేతులొక్కటి చేసి చప్పట్లు కొడదాం

బతుకు జిందాబాదని

మాటలొక్కటి జేసి మంటిని మింటిని ఒక్కటి చేద్దాం

చరిత్ర మనదేనని

 

“Three cheers to Life! … Narayanaswamy Venkatayogi, Indian Poet” కి 6 స్పందనలు

  1. అవ్వ అంటే అమ్మ కాదా?granni?

    మెచ్చుకోండి

    1. నాగరాజు గారూ,

      మీరు చెప్పినది సరైనదే. కవిత నేపధ్యాన్ని బట్టి దాన్ని అమ్మగానే తీసుకోవాలి. కాని, అవ్వ అన్నమాటకి తల్లితో బాటు, తల్లితల్లి / తండ్రితల్లి, అర్థాలతో పాటు దాన్ని ఒక వృద్ధురాలికి, పూజ్యురాలికి గౌరవవాచకంగా కూడ వాడవచ్చు. ఇక్కడ నేను వృద్ధురాలిగా తీసుకున్నాను కేవలం కవితలోని appeal కోసం.

      అభివాదములతో

      మెచ్చుకోండి

  2. బ్రతుకు అర్ధం తెలిపి…. భగ్గుమనిపించే కవిత. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు మూర్తిగారు.

    మెచ్చుకోండి

    1. అమ్మా జ్యోతిర్మయీ,

      ఈ కవిత నిజంగా ఎందరో ముక్కుపచ్చలారని పిల్లలు, అందమైన భవిష్యత్తు ఉన్న పిల్లలు, రాజకీయనాయకుల మోసపూరితమైన ఆవేశప్రసంగాలను నిజమని నమ్మి అత్మాహుతులు చేసుకోగా కోల్పోయిన తల్లిదండ్రుల ఆత్మఘోష. వార్తాపత్రికలు, ఇతరమీడియాలు నెత్తిమీద రూపాయిపెట్టినా అర్థరూపాయివిలువచెయ్యని వాళ్ళ ప్రసంగాలకు ప్రచారం ఇవ్వడంతో ఏర్పడిన దుస్థితి. రేపు బడ్జెట్ వచ్చినపుడు చూద్దురుగాని పేపర్లలో మీడియాలో జరిగే హాస్యప్రహసనం.(Farce). అధికారపార్టీ సభ్యులంతా ఏకగ్రీవంగా కొనియాడతారు, ఏమీ అర్థం కాకపోయినా. అలాగే, ప్రతిపక్ష సభ్యులు దాన్ని తెగనాడతారు. ఇందులో సగానికి సగం మంది దొంగలూ, హంతకులూ, నేరస్థులుగా చరిత్ర ఉన్నవాళ్ళో, కోర్టుల్లో కేసులు నడుస్తున్నవారో అయి ఉంటారు. వాళ్ళకి నల్ల ధనం తప్ప దేశ ఆర్థిక రంగం గురించి పిసరంత అవగాహనకూడా ఉండదు. వాళ్లకున్న వరం అల్లా ఆవేశంగా మాట్లాడగలగడం అర్థం ఉన్నా లేకపోయినా. అందుకని మీడియా వాళ్లకి ప్రచారం ఇచ్చి తమ పబ్బం గడుపుకుంటుంది.దానివల్ల వచ్చే దుష్పలితాలు వాళ్ళకి పట్టదు.
      అమాయకులైన కుర్రాళ్ళు ఇలాంటి మోసగాళ్ల ప్రసంగాలకు ఆవేశపడిపోయి ప్రాణాలు తీసుకుంటారు. అందుకే, దేశభవిష్యత్తు మట్టిపాలైంది అన్నదానిలో కొంత Metaphor లేకపోలేదు.
      ఆశీస్సులతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: