అనంతకాల గీతిక… సిడ్నీ లేనియర్,

ఒక రోజు రాత్రి మా దివాణం తోటలో నేనూ,

నా ప్రేయసీ చాలాసేపు మౌనంగా ఉండిపోయాం

ఏ గ్రహచారం వల్లనైనా, మా ఇద్దరికీ ఎడబాటు

సంభవిస్తుందేమోనని బాగా దిగులుపడుతూ.

.

అకారణంగా దుఃఖపడుతున్న నా ప్రేయసి,

మా మీద నక్షత్రకాంతి పడకుండా

అడ్డుగా ఉన్నతీగమీది ఒక ఆకుని

చేయి జాచి, పక్కకి తప్పించింది.

.

ఆమె దుఃఖాన్ని గమనించిన ఒక తారక

ఆకు తొలగించిన మార్గంలోనే సూటిగా ప్రకాశిస్తూ,

అద్దంలో ప్రతిబింబంలా,ఆమె కనుకొలకుల చివర

వేలాడుతున్న అస్రుకణంలో ప్రతిఫలించింది.

.

అప్పుడు నేనన్నాను: “ఆశకీ వేదనకీ మధ్య

ఎవరో విలపించే కన్నీటి బొట్టు కాలమంటే…

మెరుస్తున్న గోళంవంటి ఈ చిన్న బాష్పకణం లోనే

చుక్కలలోచుక్క మన కైవల్యం ప్రతిఫలిస్తోంది.”అని.

.

సిడ్నీ లేనియర్

(February 3, 1842 – September 7, 1881)

అమెరికను కవీ, సంగీతకారుడూ

Sidney Lanier
Sidney Lanier (Photo credit: Wikipedia)

A Song Of Eternity In Time

.

Once, at night, in the manor wood   

My Love and I long silent stood,   

Amazed that any heavens could

Decree to part us, bitterly repining.   

My Love, in aimless love and grief,   

Reached forth and drew aside a leaf   

That just above us played the thief

And stole our starlight that for us was shining.
  

A star that had remarked her pain   

Shone straightway down that leafy lane,   

And wrought his image, mirror-plain,

Within a tear that on her lash hung gleaming.   

“Thus Time,” I cried, “is but a tear   

Some one hath wept ‘twixt hope and fear,   

Yet in his little lucent sphere

Our star of stars, Eternity, is beaming.”

.

Sidney Lanier 

(February 3, 1842 – September 7, 1881)

American musician and poet.

Further Reading:  http://en.wikipedia.org/wiki/Sidney_Lanier

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: