ఒలింపిక్ గీతం … జాన్ విలియమ్స్

The Olympic Rings, the symbol of the modern Ol...
The Olympic Rings, the symbol of the modern Olympic Games, inspired by Pierre de Coubertin (Photo credit: Wikipedia)

(లండనులో 30వ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం అవుతున్న శుభ సందర్భంగా మానవాళికి ఈ క్రీడలు క్రీడలుగా మాత్రమే మిగిలిపోకుండా, స్వేచ్ఛా, స్వాతంత్ర్యం, సమానత్వాలపై అచంచలమైన విశ్వాసాన్ని ఇనుమడింపజేస్తూ, అగ్రరాజ్యాలూ, అగ్రనాయకులూ తమ భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఈ భావాలని పెదవులతో వల్లించకుండా,  కార్యాచరణలో చూపించి, మానవాళి పురోగతికి పాటుపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
భారత క్రీడాకారులు తమ తమ క్రీడా విభాగాలలో అత్యుత్తమ ప్రదర్శనచూపించడం ద్వారా మన జాతీయ పతాకాన్ని విశ్వవేదికమీద రెపరెపలాడించగలరని శుభాకాంక్షలూ, శుభాభినందనలూ తెలియజేస్తున్నాను.)

.

నేను జీవించే ప్రతిరోజూ
నా అత్యుత్తమ ప్రదర్శన
చూపించే రోజు
కావాలని కోరుకుంటాను.
నేను ఒక్కడినే కావచ్చు, కాని
నేను ఒంటరిని మాత్రం కాను
నా అత్యుత్తమ ప్రదర్శన
ఇంకా రావాల్సి ఉంది

.

నా గుండె పగిలింది
ఆణువణువూ శ్రమించేను
ఆ తీయదనాన్ని రుచి చూడడానికి.
నేను బాధని అధిగమిస్తాను
గెలుపూ ఓటములు చూస్తాను
ఈ అనుభవాల్లో ఇదే చివరకి మిగిలేది

.

నేను కాలంలో ఆ ఒక్క క్షణం కోరుకుంటాను
నా అంచనాలకి మించి నేను ఎదగ గలిగినది
నా కలలన్నీ ఒకే ఒక్క గుండె చప్పుడు దూరంలో
సమాధానాలన్నీ నా చేతిలో
నాకు ఆ క్షణం ప్రసాదించు
నా భవితని ఎదిరించేరోజు
ఆ క్షణంలో
నేను
అమరత్వాన్ని అనుభవిస్తాను.

.

నేను అత్యుత్తమంగా
ఉండడానికే జీవించేను
నాకు కోరుకున్నదే కావాలి
అంతకి తక్కువకి రాజీ లేదు.
నా ప్రణాళికలు వేసుకున్నాను.
ఇప్పుడు ఇక అవకాశం
నా చేతుల్లోనే ఉంది

.

నేను కాలంలో ఆ ఒక్క క్షణం కోరుకుంటాను
నా అంచనాలకి మించి నేను ఎదగ గలిగినది
నా కలలన్నీ ఒకే ఒక్క గుండె చప్పుడు దూరంలో
సమాధానాలన్నీ నా చేతిలో
నాకు ఆ క్షణం ప్రసాదించు
నా భవితని ఎదిరించేరోజు
ఆ క్షణంలో
నేను
అమరత్వాన్ని అనుభవిస్తాను.

.

ఆ ఒక్క క్షణాన్నీ హస్తగతంచేసుకున్నావా
నువ్వు ఇక జీవితకాలాన్ని జయించినట్టే
దాన్ని ప్రకాశించనీ

నేను కాలంలో ఆ ఒక్క క్షణం కోరుకుంటాను
నా అంచనాలకి మించి నేను ఎదగ గలిగినది
నా కలలన్నీ ఒకే ఒక్క గుండె చప్పుడు దూరంలో
సమాధానాలన్నీ నా చేతిలో
నాకు ఆ క్షణం ప్రసాదించు
నా భవితని ఎదిరించేరోజు
అప్పుడు,
ఆ ఒక్క క్షణంలో
నేను స్వేచ్ఛా జీవిని,

ఆ ఒక్క క్షణంలో
నేను స్వేచ్ఛా జీవిని.

.

జాన్ విలియమ్స్

This is a Copyrighted Material.

Please See the original at:

 http://www.elyrics.net/read/j/john-williams-lyrics/olympic-spirit-lyrics.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: