భారతీయ స్త్రీలు… Shiv K Kumar, Indian Poet

.

ముమ్మారు వేగిన శీలవతులైన స్త్రీలు
మట్టిగోడలపై
కోపాన్ని ప్రకటించే కనుబొమల్ని చెక్కరు

ఊరిబావి గట్టుమీది
ఖాళీ కుండల్లా ఓపికగా
మిస్సిసిపీ నదంత పొడవైన సిగపాయలలో
ఒక్కొక్క అల్లికలోనూ ఆశలు పేనుకుంటూ
నీటిలో తమ నీడలు చూసుకుంటారు
తమ కళ్ళలోని చెమ్మకై వెదుకుతూ.

ఇసుకలో కాలిబొటనవేలితో ఆశల ఆకాశాల్ని చిత్రించుకుంటూ
మనసులోని పరివేదనల్ని అణుచుకుంటుంటారు
తమ భర్తల రాకకై ఎదురుచూస్తూ…
ఒక పక్క, పొద్దు మడతపెడుతున్న తమ నీడలు
దూరాన కొండలపై అంతరిస్తున్నా సరే.
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Shiv_K._Kumar

షివ్ కె కుమార్

(ఈ పద్యంలోని సౌందర్యం చెప్పనలవి కానిది. ఇది ఇప్పుడు మృగ్యమైపోయిన ఒకనాటి పల్లెసీమల వాతావరణం చిత్రిస్తోంది. పరదేశం వెళ్ళిన పతికై ఎదురుచూస్తున్న భార్య మనః స్థితి వర్ణిస్తున్నాడు కవి ఇక్కడ. Triple-baked అన్న శబ్దాన్ని చాలా చమత్కారంగా వాడేడు. Double-baked Bread లా. Continent అన్నమాటకు ఇంద్రియనిగ్రహం అన్న అర్థం ఉంది.

విశ్వనాథ సత్యనారాయణగారు గ్రీష్మ ఋతువర్ణన చేస్తూ, ఎంతకీ వేడిమి చల్లారని రాత్రులవలన దంపతులు “అంతర్ బహిర్వహ్నితప్తులగుచు” బాధపడుతున్నారు  అని అంటారు…

ఇక్కడ కవి విరహోత్కంఠితలని వర్ణిస్తున్నాడు చాల సుకుమారంగా. జడలు పొడుగు అని చెప్పకుండనే చెబుతూ మిస్సిస్సిపి నది అంత పొడవుగా ఉన్న జడ అల్లుకుంటూ ప్రతి అల్లికలోనూ ఆశలు పెనవేసుకున్నారనడంలో ఒక సౌందర్యం ఉంటే, నీటిలో తమ కళ్ళలోని చెమ్మకోసం ప్రతిబింబాలు చూసుకున్నారనడంలో ఎంత అందం ఉందో గమనించండి. అంటే ఎంతగా ఎదురుచూసి చూసి కళ్ళు ఎండిపోయాయో! చివరగా, సూర్యాస్తమయంతో పాటు అలా అలా పక్కకి జరిగిపోతున్న తమనీడల్ని పొద్దు “ఛాయల్ని మడతపెట్టడం” గా చెప్పడం కళ్లకు కట్టించే ఒక అపురూపమైన చిత్రణ. )

.

Indian Women

In this triple-baked continent
women don’t etch angry eyebrows
on mud walls.

Patiently they sit
like empty pitchers
on the mouth of the village well
pleating hope in each braid
of their mississippi-long hair
looking deep into the water’s mirror
for the moisture in their eyes.

With zodiac doodlings on the sands
they guard their tattooed thighs
waiting for their men’s return
till even the shadows
roll up their contours
and are gone
beyond the hills.

.

SHIV K.KUMAR (b. 1921)

Indian Poet, Novelist, Playwright and Short story Writer.

Shiv K. Kumar was born in Lahore in 1921 and was educated at the local Foreman Christian College and later at Fitzwilliam College, Cambridge, from where he received his doctorate. He has travelled extensively and was a British Council Visitor at Cambridge (1961), a Research Fellow at Yale (1962), Visiting Professor at Marshall (1968) and Distinguished Professor of English at the University of Northern Iowa (1969), For a few years he was Professor and Chairman of the Department of English at the University of Hyderabad. Kumar’s poems have appeared in several Indian and foreign journals like Quest, Ariel (Leeds) and Meanjin Quarterly (Melbourne). His first collection of poems Articulate Silences was published in 1970. Since then he has published several volumes of poetry such as Cobwebs in the Sun (1974), Subterfuges (1975), Woodpeckers (1979), Broken Columns (1984) and Trap/all’s in the Sky (1987). He was awarded the Central Sahitya Academy Prize for the best writing in English in 1987. His critical writings include Bergson and the Stream of Consciousness Novel, British Romantic Poets: Recent Revaluations and British Victorian Literature: Recent Revaluations. The major themes in Kumar’s poetry are love, sex and companionship, birth and death and the sense of boredom and horror arising out of the anguish of urban life experiences. He adopts the ironic mode of a confessional poet especially in poems in which he explores the self through interaction with others. Like Robert Frost, he often selects a simple and unpretentious fact or incident and develops it into a meditative experience. Indian Women, A Mango Vendor and Rickshaw-Wallah illustrate this aspect of Kumar’s poetry. Yet another trait in his poetry is the harmonious mingling of wit, humour and irony. With a rare insight into the ridiculous aspect of a situation, experience or fact Kumar digs at follies and pretensions as seen in poems like Poet Laureate and Epitaph on an Indian Politician. 3 8 Gathered Grace Kumar is a scholarly poet with the entire range of English literature at his command. The dichotomy between the East and the West is another major theme in his poetry. Autobiographical elements overflow in poems such as Broken Columns. Kumar writes, “In view of my extensive travelling in the West, I seem to be constantly returning to the theme of cultural interaction. I feel, unconsciously, I guess, that with me contrast is almost a mode of perception. It is this awareness that compels me to recapture my days in New York as a kind of life-in- death.”

(Biographical Text and Poem Courtesy: gathered Grace, Indian Writing in English Project Gutenberg)

“భారతీయ స్త్రీలు… Shiv K Kumar, Indian Poet” కి 3 స్పందనలు

  1. కవిత్వాన్ని మీరు గొప్పగా ఆస్వాదిస్తారండి, చక్కని కవిత.అభినందనలు.

    మెచ్చుకోండి

  2. చక్కని వ్యక్తీకరణతో ఉన్న మంచి కవితని పరిచయం చేసారు.
    స్త్రీల మనసు చేసే చేతలలో చూసి తెలుసుకోవడం అంటే ..ఇలాగేనేమో అనిపించింది.
    చాలా చాలా బావుంది.పోలికతో చేసిన వర్ణన ..చాలా హృద్యంగా ఉంది.
    ధన్యవాదములు.

    మెచ్చుకోండి

    1. వనజ గారూ,
      “పరేంగితావగాహియగు బుద్ధియొక్కటే పండిత లక్షణంబు” అంటాడు పంచతంత్రంలో. అయితే, ఈ పరేంగితావగాహన కవికి కూడా కావాలి. ఒక రకంగా చెప్పాలంటే మనోవిశ్లేషణాత్మకమైన సాహిత్యం ఇప్పుడు కొరవడింది. ఎంతసేపూ కవి తాను చూసింది, తాను అందంగా ఊహించి (ఒక్కొకసారి తన అనుభవంలో లేకపోయినా) చెప్పే కవిత్వమూ, సాహిత్యమే కనిపిస్తోంది. పాత్రలనూ, సంఘటనలనూ సృష్టించి, ఒకే సంఘటనని ఒక్కొక్క పాత్ర ఆ పాత్రమనోభావాలకి అనుగుణంగా సంఘటనలను ఎలా విశ్లేషిస్తుందో చెబుతూ, తద్వారా నూతన సంఘర్షణలనీ, లేదా సమస్యలకి సమాధానం కనుగొనడమూ చూపించడానికి వ్యుత్పత్తితోబాటు విస్తృతమైన అధ్యయనమూ, పరిశీలనా కావాలి.
      ఈ కవితలో అటువంటి సాహిత్య సౌరభం దొరుకుతుంది. అందుకే మనసుకు అంద ఆహ్లాదకరంగా ఉంది.
      అభివాదములతో

      మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: