అనువాదలహరి

ప్రేమ తత్వం … Tagore

.

English: Rabindranath Tagore Hampstead England...
English: Rabindranath Tagore Hampstead England 1912 (Photo credit: Wikipedia)

రాత్రి చూడబోతే నల్లగా ఉంది, ఈ అడవికా అంతు కనిపించదు;

లక్షలమంది మనుషులు లక్షలమార్గాల్లో వస్తూపోతూ ఉంటారు.

ప్రతివారికీ ఈ చీకటిలోనే తాము చేరవలసిన సంకేతస్థలాలుంటాయి

కానీ, ఆ కలయిక ఎక్కడో, ఎవరితోనో, ఎందుకోసమో మాత్రం తెలీదు.

అయితే, మనకో నమ్మకం ఉంది: ఏ క్షణంలో నైనా

పెదాలపై చిరునవ్వు చిందుతూ, మన జీవనభాగ్యరేఖ ఎదురౌతుందని

సువాసనలూ, శబ్దాలూ, స్పర్శలూ, పాటలపల్లవులూ

మనల్ని తాకుతూ, పులకింతలు కలిగిస్తూ పోతుంటాయి.

కాని ఒకసారి ఒక విద్యుల్లత మెరుస్తుంది; ఆ క్షణంలో

నాకెవరు ఎదురౌతారో వాళ్ళతో అమాంతం ప్రేమలో పడిపోతాను.

ఆ వ్యక్తితో “నా జీవితం ధన్యమైంది! నీ కోసమే

ఇంతదూరం నడిచివచ్చాను” అనిచెప్పి ఆనందభాష్పాలు రాలుస్తాను.

ఈ చీకటిలో అంతదగ్గరగానూ వచ్చి దూరమైపోయినవాళ్ళు

అసలు ఉన్నారో లేదోనన్న ఉనికి కూడా నాకు తెలీదు.

.

టాగోర్

.

On the Nature of Love

The night is black and the forest has no end;
a million people thread it in a million ways.
We have trysts to keep in the darkness, but where
or with whom — of that we are unaware.
But we have this faith — that a lifetime’s bliss
will appear any minute, with a smile upon its lips.
Scents, touches, sounds, snatches of songs
brush us, pass us, give us delightful shocks.
Then peradventure there’s a flash of lightning:
whomever I see that instant I fall in love with.
I call that person and cry: ‘This life is blest!
For your sake such miles have I traversed!’
All those others who came close and moved off
in the darkness — I don’t know if they exist or not.

— Rabindranath Tagore

6 thoughts on “ప్రేమ తత్వం … Tagore”

 1. చాలా మామూలుగా,సరళంగా క్లిష్టమైన భావనలను చెప్పడం లో
  టాగోర్ శైలి అద్భుతంగా వుంటుంది.
  ఇది గీతాంజలి లోది కాదు, కదా.
  thank you sir.

  మెచ్చుకోండి

  1. శేఖర్ గారూ,
   నా బ్లాగుకి స్వాగతం. టాగోర్ రచనలలో భారతీయ చింతన ప్రతిఫలిస్తుంటుంది. “Love is more spiritual for us than temporal. It is a step in our spiritual quest and not an end in itself.”
   అభివాదములతో

   మెచ్చుకోండి

Sekharకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: