నాకు పూలంటే ఇష్టం లేదు … అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి

Русский: Категория:Изображения:Одесса
Русский: Категория:Изображения:Одесса (Photo credit: Wikipedia)

నాకు పూలంటే ఇష్టం లేదు… అవి ఎప్పుడూ

విందుభోజనాలనీ, నాట్యశాలల్నీ, పెళ్ళిళ్ళనీ

శవయాత్రలనీ గుర్తుచేస్తుంటాయి.

కానీ, చిన్నప్పుడు నాకు ఊరటగా నిల్చిన

నశ్వరమైన గులాబీల నిత్య నూతన సౌందర్య శోభ

ఇన్ని సంవత్సరాలూ నాలో నిలిచిపోయింది…వారసత్వంలా…

మోచాత్ అజరామర సంగీతం గొంతులో కూనిరాగాలు తీసినట్టు.

.

అనా అఖ్మతోవా

(జూన్ 23, 1889 – మార్చి 5,  1966)

సోవియట్ రష్యను కవయిత్రి

.

(ఈ కవితలో ఆవేదన పూలంటే నిజంగా ఇష్టం లేకపోవడం కాదు. వాటిని ఎటువంటి పనులకు నియోగిస్తున్నారో తలచుకుని తనబాధని వ్యక్తం చేస్తున్నాది కవయిత్రి (నా అభిప్రాయంలో). ఆమె ఇందులో ఇంకొక్కటి చేర్చితే బాగుణ్నని పించింది. అయితే ఆమెకు అలాంటివి అనుభవంలో లేకపోబట్టివ్రాయలేదు. ఉంటే, అన్నిటికంటే ముందుగానే చెప్పేదేమో. ఈ మధ్య ఒక స్వామీజీ ఒకానొక నగరానికి వేంచేస్తే, ఆయనకి భక్తులు గులాబీపుష్పాలతివాచీ పరిచేరు. అది TVలో ప్రసారం అయింది.  ఒక స్వామీజీనడవడానికి అన్ని గులాబీ పూలు నాశనం చెయ్యాలా అని నా శ్రీమతి ఆవేదన వ్యక్తం చేసింది. నిరాడంబరత, నిస్సంగత్వం వంటి సత్యాలని వెయ్యి ప్రవచనాలకంటే, చిత్తశుధ్ధిగా చేసే ఆచరణ వల్ల ఆవిష్కరించగలమన్న సత్యం ఇటు ప్రజలకీ, అటు స్వామీజీలకీ ఎప్పుడు అవగతమవుతుందో)

.

I Don’t Like Flowers

.

I don’t like flowers – they do remind me often
Of funerals, of weddings and of balls;
Their presence on tables for a dinner calls.

But sub-eternal roses’ ever simple charm
Which was my solace when I was a child,
Has stayed – my heritage – a set of years behind,
Like Mozart’s ever-living music’s hum.

.

Anna Akhmatova

(June 23  1889 – March 5, 1966)

A Soviet Modernist Poet

Born Anna Andreyevna Gorenko, she is more popular by her pen name. Requiem (1935–40) is her tragic masterpiece about the Stalinist terror. Her simple and emotionally restrained style was original and distinguished her from her contemporaries. Her’s was a strong female voice. In spite of continued censorship and condemnation of her poetry she did not leave the country but chose to stand witness  to the atrocities around her. Meditations on Time and Memory, and difficulties in writing and living under the shadow of Stalinism were her recurrent themes.

In my opinion,  it is not her disliking for flowers that  Akhmatova portrays in this poem, but her protest for the kind of use they are put to. Had she known (or seen) the kind of misuse flowers are put to these days, I am sure, she might have mentioned it first thing here. People were mad to give a Rose-carpet welcome to a Swamiji which was broadcast live on TV.  My wife was upset and commented that if it was necessary to waste so many roses for such welcome.  No one knows when the simple truth dawns on Swamijis and their devout devotees that one can teach austerity and simplicity in life more by practice than by precept or any amount of lecturing.

“నాకు పూలంటే ఇష్టం లేదు … అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి” కి 15 స్పందనలు

  1. శీర్షిక చూసి ఒక రచయిత్రికి పూలంటే ఇష్టం లేకపోవడమా!! అని ఆశ్చర్యపోయా కానీ రచన చదివిన తరువాత మీ మాటలతో ఏకీభవిస్తున్నా.

    మెచ్చుకోండి

    1. అమ్మా రసజ్ఞా,
      కొన్ని కవితలు మొదటి పాదాల్లోనే ఒక ఉగ్గబట్టుకుని చదివించే పరిశీలనతోనో, వ్యాఖ్యానంతోనో ప్రారంభమవుతాయి. అది తర్వాతనిరూపించడమో, వ్యంగ్యంగా లేదా నిందాత్మకంగా చెబుతూనే సమర్థించడంతోనో ముగుస్తుంది. రచయిత్రి చేసిన ప్రయోగంకూడ అదే. ఆమెతో మనం ఏకీభవించకుండ ఉండలేం.
      ఆశీస్సులతో

      మెచ్చుకోండి

  2. mee sreemathi cheppindi chaalaa nijam sir.

    మెచ్చుకోండి

    1. Thank you so much sir.
      with best regards

      మెచ్చుకోండి

  3. కవయిత్రి ఎంత లోతుగా అభివ్యక్తీకరించారు. ఆవేదన నిండిన వాస్తవం.చాలా బాగుంది.
    కొమ్మకి ఉన్న పువ్వులని చూసిన ఆనందం..దేవుని పాదాల చెంత చేరాలని పువ్వుల ఆరాటం.. ఈ రెండు మినహా.. సుకుమారమైన పూలని ఎలా కర్కశ పాదాల క్రిందకి, అలంకరణ లకి ,మరో గంటలోనే చెత్త కుండీలలోకి చేరి పోయే వైనం ని చూస్తే పూలు అంటే ఇష్టం లేదనే చెపుతాం.

    మెచ్చుకోండి

    1. వనజగారూ,
      పువ్వులంటే ఇష్టపడేస్త్రీలకి కూడ బాధకలుగుతోందంటే, ఆ చర్యలలోని అనౌచిత్యాన్ని మనం గమనించవచ్చు. జంతుబలి అనగానే విలవిలలాడిపోయే మనం (నేను దాన్ని సమర్థించడం లేదు), పువ్వుల్ని అలా నిష్ప్రయోజనంగా, కొందరు కాళ్ళక్రింద తొక్కేసి, రూప, రసహీనంగా చేస్తున్నా ఆనందిస్తున్నాం అంటే ఆశ్చర్యం వేస్తుంది. భగవంతుడుకూడా వాటిని కాళ్లతో తొక్కడు. అక్కడ ఉంచిన పుష్పాలు మళ్ళీ తలలలోకే వెళ్తాయి. మీరన్నట్టు చక్కగా చెట్టుమీదనే ఉండి కనువిందు చెయ్యవలసిన పువ్వులు వయసూ, వాసనా ఉంటుండగానే చెత్తకుప్పల్లోకి పారేస్తుంటే బాధవేస్తుంది.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  4. చిన్నప్పుడు చదువుకున్న ఫూల్ కీ చాహ్ గుర్తొచ్చిందండీ. అసలు పూలకి ఏమిష్టం? అవి ఏం కోరుకుంటాయి? అని రాశారు కవి మైధిలీ శరణ్ గుప్తా

    http://abhinav.org/blog/2008/01/13/pushp-ki-abhilasha/

    మెచ్చుకోండి

    1. Indian Minervaగారూ,
      ముందుగా మీ ముఖచిత్రం (ప్రొఫైల్ పిక్చర్) నాకు ఎంతగానో నచ్చింది. అంతనిష్కల్మషమైన నవ్వు మనకి చాలా తక్కువచోట్ల దొరుకుతుంది… బహుశా మళ్ళీ పువ్వులనీ, పువ్వులులాంటి పిల్లల్నీ చూస్తుంటేనే వస్తుందేమో.
      మీరు మైథిలీ శరణ్ గుప్తాగారి ఈ ఫూల్ కి చాహ్ అనగానే నాకు కరుణశ్రీగాలి పుష్పవిలాపమూ, వేదుల సత్యనారాయన శాస్త్రిగారి “కాంక్ష” అన్న కవితా ఖండికా గుర్తొచ్చాయి. కరుణశ్రీగారు ఏదో సందర్భంలో చెప్పినట్టు గుర్తు. అతని పద్యాలు వేరొక కవికి ప్రతిబింబాలుగా ఉన్నాయన్న అపవాదుకి సమాధానం ఇస్తూ అసలు వాటిని నాకు చదివే అవకాశమే లేదు అని. నిజానికి తొలితరం ఇంగ్లీషు చదువులప్రభావం, సాహిత్యంలో రొమాంటిక్ మూమెంట్ ప్రభావంభావం గాఢంగా ఉన్నరోజుల్లో, వస్తువులని భిన్నమైన కోణంలో చూడడం, ప్రకటించడం జరిగింది. దానిప్రభావంలోనే దేశం మొత్తం మీద అన్నిభాషలలోనూ ఇటువంటి కవిత్వం వచ్చి ఉండొచ్చు. విషయం ఒకటే అయినా, కరుణశ్రీ గారి పద్యాలూ, వేదుల వారి పద్యాలూ భిన్నంగా ఉండడమే గాక ఇద్దరిశైలిలోనూ ఉన్న వ్యత్యాసాన్ని ఇట్టే పట్టిచూపిస్తాయి. కరుణశ్రీగారి మాటలు అతిసరళంగా వెన్నలా సాగిపోతే, వేదులవారి పద్యాలు కుట్టుకనపడకుండా బట్టలు కుట్టినవాడి పనితనం గుర్తుచేస్తుంది. ఇద్దరూ పడికట్టుమాటలూ, పొల్లు మాటలూ వాడరు పద్యాల్లో… దేశం స్వాతంత్రోద్యమంతో అట్టుడికిపోతున్నరోజులు గనక ఆ విషయంలో భావసారూప్యం ఉండొచ్చునేమోగాని.
      మంచి లింకు అందజేసినందుకు కృతజ్ఞతలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  5. She probably lived in a world of euphoria, past is beautiful than present or future.

    A flower is a flower either at the plant or on the floor.

    In funeral or birth its participatory for it represents that essence in its fragile life every day living and dying.

    It cares for neither.

    Its day dawns with its Master and it ends with it. Thats it.

    cheers
    zilebi.

    మెచ్చుకోండి

    1. జిలేబీ గారూ,
      ముందుగా చాలా విస్తృతమైన కాన్వాసులో రాసిన మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు.
      “past is beautiful than present or future.”
      ఇదే విషయాన్ని చాలా మంది చెప్పారు… గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అని. అదినిరాశావాదముతో కూడిన భావప్రకటన అనుకొండి. అదివేరే విషయం.
      అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ప్రకృతిని మనం ఎప్పుడూ మన అవగాహన(understanding), విశ్లేషణ (Analysis or interpretation) పరిమితులకులోబడి మాత్రమే అర్థంచేకోగలం. కనుక ఈ విషయాల్లో మనప్రమాణాలబట్టి (measures) మన ప్రకృతిగురించి మనం వెలిబుచ్చే అభిప్రాయాల విలువ కూడా ఆధారపడి ఉంటుంది. కవులు మొదట్లో పాత్రలలోనే పరకాయప్రవేశం చేసి, వాళ్ళు ముందుగా సంకల్పించిన లక్ష్యాలమేరకు పాత్రలచే ఆ మాటలూ, ఆ భావాలూ పలికించే వారు. కాని భావకవితోద్యమం లేదా కాల్పనికోద్యమం వచ్చిన తర్వాత, మానవేతర వస్తువులలోకూడ కవులు పరకాయప్రవేశం చేసి వాటి భావాలుగా తమ అభిప్రాయాలు చెప్పడం, ముఖ్యంగా చెట్లూ చేమలకి (దీనికి చెట్లకు ప్రాణం ఉందని భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్ర బోస్ చేసిన నిరూపణ ఇంకా తోడయ్యింది) అలవాటయ్యింది.

      (A flower is a flower either at the plant or on the floor….. It cares for neither.) … అని మీరన్నది మనిషుల దృష్టిలోంచి నిజం. మరి పువ్వులుకూడ వాటి జీవితాల గురించి అలాగే అనుకుంటున్నాయా? చెప్పలేం.వాటికి అన్వయించిన ప్రమాణమే మనిషికి అనువర్తించినపుడు మనమెందుకు జీవితం గురించి ఇంతక్షోభ పడిపోతున్నాం? విధికృతాన్ని ఏ రకమైన complaint లేకుండా ఎందుకు స్వీకరించడం లేదు? ప్రకృతిలోని ఇతర జీవజలాన్నీ, నిర్జీవపదార్థాలనీ మనసుఖంకోసం వాడుకుంటున్నాం. మనిషి చనిపోతే పువ్వులుంచినపుడు పువ్వురాలిపోతే మనిషిని చంపడంలేదేం?
      పువ్వులజీవితం ఇంతే అని ఒక edict(శాసనం) జారీ చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు.
      ఇంతకీ, ఇవన్నీ కేవలం మన ఊహాజనిత భావనలు. నిజం మనకి అందనంత దూరంలో ఉండొచ్చు. కనుక కవిత్వాన్ని ఒక భావనాపరమైన అభ్యాసంగా (an exercise in thought rather than an experiment in science) స్వీకరించమని మనవిచేస్తున్నాను.
      మీ భావస్ఫోరకమైన వ్యాఖ్యకి మరొకసారి ధన్యవాదాలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  6. బాగా అనువదించారు మూర్తి గారూ!.ధన్యవాదాలు.

    మెచ్చుకోండి

    1. హేమలతగారూ,
      ధన్యవాదాలు.
      అభివాదములతో

      మెచ్చుకోండి

  7. “మోచాత్” సరి అయిన పలుకుబడేనా… “మొజార్ట్” కాదా?

    మెచ్చుకోండి

    1. ఫణీంద్రగారూ,

      అవును. తెలుగులో డాంటే అనీ, మొజార్ట్ అనీ రాయడం చూసేను. నేను Mozartని ఎలాపలకాలో Forvo.com లో వెతికాను. అక్కడ దాంతే అనీ, మోచాత్ అనీ పలికే విధానం ఉంది.

      అభివాదములతో

      మెచ్చుకోండి

  8. now i think my url will open, thank you sir,

    మెచ్చుకోండి

Leave a reply to Vanaja Tatineni స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.