ఒకరికొకరు … Paul Farley

paul farley
Paul Farley (Photo credit: jontintinjordan)


నిశ్శబ్ద నిశీధిసీమలలో నడుస్తూ

ఒకరికొకరం ఎంత హాయిగా జీవిస్తున్నాం…

నువ్వు నాకోసం తలుపు తెరుస్తావు, నీ ఫోను నేను ఎత్తుతాను


నేను చప్పుడుచేస్తూ సంగీతం వాయిస్తుంటాను

నువ్వు లైటువేసుకుని చదువుతుంటావు.

నీ బుగ్గవంపూ, అందమైన కళ్ళూ, సరైన

మోతాదులో వాడిన “ఓ డ కలోన్” సువాసనా ఎంతో బాగుంటాయి.


“నువ్వేమిటి ఆలోచిస్తున్నావు?” అని మనిద్దరికే

తెలిసిన స్పర్శభాషలో అడుగుతాను.

నువ్వు “పెద్దగా ఏమీ లే”దని నా అరచేతిని తడతావు


స్టేషన్లలో మనం ఇంద్రియాలతో పోటీ పడతాం

సొరంగంలో వెలుతురుముందా,

రైలుపట్టాల క్రింది ధడక్ ధడక్ శబ్దం ముందా అని.

భోజనానికి వెళుతూ, నీ కాళ్ళలో కాళ్ళు పెడతాను

నువ్వు నా పెదాలు తడిచేస్తావు, నేను నీ పెదాలపై

బ్రెయిలీ లిపిలో ఏదో రాస్తాను.

.

పాల్ ఫార్లీ

Born in 1965 in Liverpool, Paul Farley is an award-winning English poet.

For reasons of copy right the original could not be produced here.

Please visit: http://www.poets.org/viewmedia.php/prmMID/21717 to read the original Dependants

“ఒకరికొకరు … Paul Farley” కి 2 స్పందనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: