
.
మీరు రోజు గడుపుతూ
ఆలోచనలో ములిగిపోయినా
నన్ను మరిచిపో వద్దు.
నేను యుధ్ధం చేసేను.
చేస్తూ గాయపడ్డాను.
నన్ను మరిచిపోవద్దు.
ఋణం తీర్చుకోలేని
ప్రాణత్యాగాలవల్ల స్వాతంత్ర్యం వచ్చింది.
నన్ను మరిచిపోవద్దు.
మీ పిల్లలకి బోధించినపుడల్లా
గతాన్ని గుర్తుంచుకోమనండి.
నన్ను మరిచిపోవద్దు.
మీరు బాధలో ఉన్నా,
ప్రార్థనలో ఉన్నా
నన్ను మరిచిపోవద్దు.
నేను తూటా పేలడం విన్నాను.
అయినా, వెన్నిచ్చి పారిపోలేదు.
నన్ను మరిచిపోవద్దు.
నేనొక దేశభక్తుడిని
ఈ రోజు మీ సాయం నాకు కావాలి.
నన్ను మరిచిపోవద్దు.
.
అజ్ఞాత కవి
(ఇది చూడడానికి అమెరికాకు చెందిన విషయంలా కనిపించవచ్చు గాని, ఇది మనందరకూ చెందుతుంది. ఈరోజు స్వతంత్రవాయువులు పీల్చుకుని బ్రతుకుతున్న ప్రతి భారతీయుడికీ వర్తిస్తుంది. మనం దేమునికి రోజూ ఏదో కావాలని మొక్కుతూనే ఉన్నాం. ఉంటాం. ఎన్నడైనా మన స్వేఛ్ఛకి తమ ప్రాణాలర్పించిన వాళ్లని ఏడాదికొక్కసారైనా తలుచుకున్నామా? స్వాతంత్ర్య దినోత్సవంనాడో, గణతంత్ర దినోత్సవంనాడో వాళ్ళ త్యాగాలు నిష్ఫలం కానీయమనీ, వాళ్ళు అసంపూర్ణంగా వదిలిన కార్యాన్ని పూర్తిచెయ్యడానికి, ఎన్ని ప్రలోభాలెదురయినా నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ పునరంకితమవుతామని మనకు మనం వాగ్దానం చేసుకున్నామా? తెల్లవాడి దౌర్జన్యాన్నీ అరాజకాన్నీ వాళ్లెదిరించగలిగితే, నల్లవాడూ అదేపని చేస్తున్నప్పుడు మనం ఎదిరించలేమా? ఒక్క సారి ఆలోచించండి. ఇప్పటి రాజ్య వ్యవస్థ చూస్తే, సమాధులలోని వాళ్ళ పవిత్రాత్మలు ఎంత శోకిస్తాయో!).

Leave a reply to NS Murty స్పందనను రద్దుచేయి