అమర సైనికుడు … రాబర్ట్ ఫ్రాస్ట్

Robert Frost poses with his birthday cake on h...
Robert Frost poses with his birthday cake on his 85th birthday (Photo credit: Wikipedia)

.

మంచుకురిసినా, తుప్పు పట్టినా,

నేలలోకి దిగింది దిగినట్టుగా

మట్టిలో దూసుకెళ్ళిన పదునుతోనే ఉండిపోయిన

పైకితియ్యని కత్తిలాంటి వాడు అతను. 

మనం ప్రపంచాన్ని ఎంత పరికించి చూచినా

అతను ప్రాణాలర్పించడానికి తగ్గ ఉదాత్తలక్ష్యం కనిపించదు

కారణం, సామాన్యజనం లాగ, మనమూ హ్రస్వదృష్టులమే

భూమికి పరిమితమైన మన ఆలోచనల్లాగే

మన అస్త్రాలు కూడా ఎంతో ఎత్తుకు ఎగరలేవని మరిచిపోతాం.

అవి రాలిపోయి, పచ్చికను చీల్చుకుని

భూతలాన్ని తాకి, ధ్వంశమైపోతాయి.

మనం శిలాఫలకాలపై శాశ్వతమైన

కీర్తిప్రతిష్ఠలకోసం అల్లాడేట్టు చేస్తాయి.

కానీ, మనం ఒకటి మాత్రం తెలుసుకోవాలి.

అతను తన మానప్రాణాలర్పించిన లక్ష్యం

మనం చూడనిదీ, ఊహకు అందనిదీ.

.

రాబర్ట్ ఫ్రాస్ట్

(ఈ కవితని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక సైనికుడు పోరాటంలో మరణించేడు. అతను ఒక చిన్న లక్ష్యానికి తన జీవితం ధారపోశాడా లేక అంతకన్న ఉదాత్తమైన లక్ష్యం ఏదైనా ఉన్నదా? మనందరికీ శాశ్వతమైన కీర్తి ప్రతిష్ఠలు కావాలి. కాని మన ఆలోచనలు గాని, మన ప్రయత్నాలుగాని ఉదాత్తమైన దిశలో ఉండవు. కనుకనే అవి ఇలా వెళ్లినవి అలా తిరిగి వస్తాయి. కాని. ఈ సైనికుడి సమాధి ఎప్పుడు చూసినా అతను తన ప్రాణాలర్పించిన లక్ష్యం గుర్తుచేస్తూనే ఉంటుంది కొత్తగా . అంతే కాదు, ఆ ప్రాణత్యాగం యుధ్ధంలోనే  కాకపోవచ్చు. ప్రజలను రక్షించే ప్రయత్నంలో బొంబాయి టెర్రరిస్టు దాడుల్లో, కమాండో సునీల్ యాదవ్ ని రక్షిస్తూ నేలకొరిగిన నేషనల్ గార్డ్స్ కి చెందిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ లాగ ఉన్నతమైన మానవత్వమూ, దేశం యొక్క విస్తృతప్రయోజనాలూ, అంతరాంతరాల్లో తర్వాతి తరాలకు తను నిర్వర్తించే బాధ్యతా  కూడ అయి ఉండొచ్చు. ఈ ఆదర్శం మనం లౌకికమైన గెలుపు ఓటముల పరిధిలో చూసినంత కాలమూ మనకు అవగాహనకాదు.
ఈ రోజు దేశభక్తి గురించి ఎందరు మాటాడుతున్నారు? దేశానికి ప్రాణం అర్పించడానికి ఎందరు సంసిధ్ధులై ఉన్నారు? అన్న విషయం మనం ఒక్కసారి మననం చేసుకో గలిగితే, ఈ సత్యం అర్థమవుతుంది.)

.

The Soldier

.

He is that fallen lance that lies as hurled,
That lies unlifted now, come dew, come rust,
But still lies pointed as it plowed the dust.
If we who sight along it round the world,
See nothing worthy to have been its mark,
It is because like men we look too near,
Forgetting that as fitted to the sphere,
Our missiles always make too short an arc.
They fall, they rip the grass, they intersect
The curve of earth, and striking, break their own;
They make us cringe for metal-point on stone.
But this we know, the obstacle that checked
And tripped the body, shot the spirit on
Further than target ever showed or shone.

Robert Frost

“అమర సైనికుడు … రాబర్ట్ ఫ్రాస్ట్” కి 4 స్పందనలు

  1. నిజాయితీ కల్గిన ఘనత ని, త్యాగానికి అర్ధం చెప్పే కవిత. మీ అనువాదము,.తర్వాత మీ వ్యాఖ్యానం చాలా బావుంది.

    మెచ్చుకోండి

  2. వనజ గారూ,
    మీ వ్యాఖ్యకి కృతజ్ఞతలు. ఇవాళ దేశభక్తి గురించి మాటాడాడం ఒక taboo. నేను ప్రభుత్వోద్యోగిగా ఉన్నప్పుడు ఒక సహచరుడితో వచ్చిన వాగ్వివాదం లో అతను వాళ్ళనాన్నగారు చెప్పిన ఉపదేశాన్ని చెప్పేడు. అది వింటే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి. అతను ఆలక్ష్యం పాటిస్తూనే ఉద్యోగం చేశాడు. దానివల్లే అతనికీ నాకూ తగువు వచ్చింది కూడా. ఇంతకీ వాళ్ళనాన్నగారు (అతను రైల్వేలో TTEగా పనిచేశారు) చెప్పిన హితోపదేశం ఇది:
    నాయనా! ప్రభుత్వోద్యోగం ఒక గని లాంటిది. దాన్ని నువ్వు ఓపికున్నంత మేర తవ్వుకోవడమే.
    బహుశా ఈ సిధ్ధాంతమే మన “రాజ”కీయనాయకులకు అంది ఉంటుంది. ప్రభుత్వోద్యోగమన్నా, ప్రభుత్వాన్ని నడపడమన్నా ఒక్కలాంటివే కాబట్టి దాన్ని అక్షరాలా ఆచరణలోపెట్టేశారు.
    ఇవాళ ప్రభుత్వోద్యోగుల మానసిక స్థితి దీనికి భిన్నంగా ఉందని నేననుకోను. ఇప్పుడు ప్రజలు దేశం ఒక ప్రత్యేకవ్యక్తిగా, తాము అందులో భాగస్వాములం కానట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఉంటే, ఎవరిపరిధిలో వాళ్ళు దీన్ని తవ్వుకుపోయే ప్రయత్నాలు చెయ్యరు.
    అందుకే ఇలాంటి కవితలు వాటి రెలవెన్సుని ఎన్నటికీ కోల్పోవు.
    అభివాదములతో.

    మెచ్చుకోండి

  3. కుచ్ యాద్ ఉన్‌హె భీ కర్ లొ
    జో లౌట్ కె ఘర్ న అయె

    జో షహిద్ హు ఎ హై ఉన్ కీ
    జర యాద్ కరొ కుర్బాని

    మెచ్చుకోండి

  4. Snkr గారూ,
    బాగా చెప్పారు. ఇవేళ మనం నిజంగా ఎవరికీ అడుగులకి మడుగులొత్తక్కరలేకుండా బ్రతకగలుగుతున్నామంటే, అది చరిత్రకందని ఎందరో వీరుల త్యాగ ఫలం. వాళ్ళ ఋణం మన వెయ్యి జన్మలకు కూడా తీర్చుకోలేము. ఈ కాలం లోనే మనం ఏ ఆఫ్ఘనిస్తానులోనో, ఆఫ్రికాలోని చాలా దేశాల్లోనో పుట్టుంటే, మన పరిస్థితి ఊహకు కూడా అందనిది. But we are wretched and thankless people unable to carry the baton and discharge our responsibility to our posterity. We can do that only when we remember them everyday, whether we pray god or not.

    అభివాదములతో,

    మెచ్చుకోండి

Leave a reply to Vanaja Tatineni స్పందనను రద్దుచేయి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.