
ఉపదేశం … సారా టీజ్డేల్

సారా టీజ్డేల్ ఈ భావాన్ని ఎంత సుకుమారంగా చెప్పిందో గమనించండి. మనం మనము కాము. మన శరీరం మనది కాదు. మన భావాలు మనవి కావు. (తమకృషి, కష్టం ఏమీ లేకుండా, పిల్లలకి చదువుచెప్పడానికీ లక్షలు వసూలుచేసే విద్యాసంస్థలని నిలదీయకపోగా, అహ్లువాలియావంటి మహాశయులు విశ్వవిద్యాలయాల్లో ఫీజులు పెంచాలని సెలవిస్తున్నారు. ఈ నేలమీద పుట్టిన పిల్లలలకి ఆరోగ్యం, విద్యా ఉచితంగా ఇవ్వలేని ప్రభుత్వాలు వాటి బాధ్యతని ఏమిటి నిర్వర్తిస్తున్నట్టు. ఉద్యోగస్తులకి జవాబుదారీ ఉంటుంది. అంతకంటే ఎక్కువ అధికారాన్నీ, జాతి వనరులనీ వినియోగించుకుంటున్న ప్రభుత్వాలకి పనిచెయ్యలేకపోతే జవాబుదారీ ఉండదా అనిపిస్తుంది.)
సారా టీజ్డేల్
Atoms as old as stars,
My spirit like my flesh
Here for a moment’s space
American Poet
“ఉపదేశం … సారా టీజ్డేల్” కి 8 స్పందనలు
-
“ఎప్పుడూ సౌందర్యం కోసమే అన్వేషించు; మృత్యువుతో పోరాటంలో మనిషికి అండగా నిలిచేది అదొక్కటే!”
తాత్వికుడు ( జ్ఞాని) కవిగా కవితా రూపాన ఏమి చెప్ప దలిచార అని ఆలోచిస్తే ,,,,
తాత్వికుడు అంటే తత్వం తెలిసిన వాడని అర్థందేని తత్త్వం ? కనిపించే వాటి తత్త్వం తద్వారా కనిపించని వాటి తత్త్వం
కనిపించేది ఎవరు మీకు నేను నాకు మీరు,మనం అంటే మన శరీరం మన మనసు,
శరీరం భూమి లోంచి భూమి సూర్యాది నక్షాత్రాల్లోంచి
మరి మనలో భావాలో మన పూర్వీకుల అనుభవాలు వాటి సారము కలసి
మన ఆలోచనలైనాయి …!!సరే ! తత్త్వం చెప్పారు బానే వుంది?
ఇంతకు ప్రయోజనం ఏమిటి ? దీనివల్ల?“ఎప్పుడూ సౌందర్యం కోసమే అన్వేషించు; మృత్యువుతో పోరాటంలో మనిషికి అండగా నిలిచేది అదొక్కటే!”
ఇదేదో తికమక statement లానే ఉంది,
సౌదర్యం కోసం అన్వేషించటం నిజమే నేను చేసేది సౌందర్యా రాదనే,
కనిపించే అందాలూ, వినిపించే రాగాలు, అఘ్రానించే సుగంధాలు,
రుచికరమైన మధురాలు, నన్ను నేను మరిచేలా చేసే స్పర్శ అనుభూతులు,,,
ఇవే కదా! సౌందర్యాలునేను లేచిన దగ్గర నుంచి పడుకునే దాక చేసేది ఇదే…
కాని ఇక్కడ ఈ తాత్వ్హికుడు పెద్ద మెలిక పెట్టారు,
అందం చూడవయ అందిచ వయా అన్నారని
అదే సౌందర్యారాధన అని చేస్తుంటే,,,
అది మృత్యు పోరాటం లో నాకు అండగా ఎలా నిలుస్తుంది అని శంక?అలానే సంగీతం, etc ను,
మరి మృత్యు పోరాటం లో తోడుండే సౌందర్యమ్ ఏమిటి?అసలు బ్రతికుండగా సౌందర్యం లో లీనమైన నన్ను లేపి మరి
ఇది నీ మృత్యు సమయం లో అండ నిలుస్తుందో లేదో చెక్ చేసుకో మంటాడు ఏమి ఈయన?
అన్నమయ్య సినిమాలో రమ్య కృష్ణ తో సౌందర్యా ఆరాధన లో ఉన్న నాగార్జునా ని
సుమన్ లాక్కెళ్ళి ఇంతకంటే శాశ్వత సౌందర్యం చుపిస్తా,,,,నేనేదో బుద్ధి తక్కువై కుక్క కు బూడిద గుంట సౌందర్యం అయినట్లు
నాకు నా మానన సౌందర్యారాధన చేసుకుంటుంటే,,,అది మృత్యులో అండ గా ఉంటుందో లేదో check చేసుకో మంతునాడు ఇతడు
ఎందుకు సర్??!
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
నిజమే కదా! మరి మనం సౌందర్యం అనుకుంటున్నది, కుక్క బూడిద గుంట సౌందర్యం అనుకోవటం వంటిదే,,,
సౌందర్యం అంటే దేహ మనో సౌఖ్యాన్ని ఇచ్చేది అని కాదు,
శాశ్వతత్వాన్ని ఒనగూర్చేది అని,ఒకరు జ్ఞాని అని గుర్తించాలంటే ఎవరి ప్రతి ఆలోచన పూర్నమై ఉంటుంది అది
అంటే మనం బ్రతికున్నప్పటి అంశాలే ఆలోచన చేస్తాం.చచ్చాక ఎమౌన్తుంది అన్నంత దూరం వెళ్ళాక పోయిన కనీసం చనిపోయేప్పుడు ఏమౌతుంది?
అని ప్రశ్నిచుకుని ,…
లోక అనుభవాన్ని గమనిమ్పులోకి తీసుకునిఆ స్థితిలో మనకు తోడుగా ఉండేది ఎవరో గుర్తించి వారితో సావాసం చేస్తూ
ఆ సహాయకుడిని ఆరాధన చేయటమే ….
మన కర్తవ్యం !!మెచ్చుకోండిమెచ్చుకోండి
-
శివగారూ,
ముందుగా మంచి చర్చకు తెర తీసినందుకు కృతజ్ఞతలు. మీ ప్రశ్నలకు కొంతవరకు జ్యోతిర్మయిగారికి ఇచ్చిన ప్రతిస్పందనలో సమాధానాలు దొరుకుతాయి. కాకపోతే, ఇక్కడ సౌందర్యాన్ని గురించి మీరిచ్చిన నిర్వచనము నాకున్న కొద్దిపాటి పరిజ్ఞానంలో తాత్త్వికులెవ్వరూ చెప్పలేదు. తాత్త్వికులకి భౌతికమైన సౌందర్యం సౌందర్యం కాదు. అది క్షణికం(transcient).
మృత్యువుతో పోరాటమన్నది నిరంతర ప్రక్రియ. మృత్యువు మనల్ని ఇక్కడనుండి ఎక్కడికో లాక్కెళ్ళిపోతుందనీ, ఇక్కడ మనం అనుభవిస్తున్న ఆనందాలు కోల్పోతామనీ మనకి ఒక భావన/ భయం ఉంటుంది. నిజానికి మనకున్న ఈ భయమే మనచేత అన్నిరకాలైన మంచిపనులూ చెడ్డపనులూ చేయిస్తుంది. మృత్యువుని ఆనందంగా స్వీకరించడంలో ఉన్న తాత్త్విక పరిపూర్ణత మనం సోక్రటీసులో చూస్తాం. ఈ సన్నివేశం గురించి నండూరి రామమోహనరావుగారు తమ “విశ్వదర్శనం” పుస్తకం లో పరమాద్భుతంగా వ్రాసేరు. వీలయితే ఒక్కసారి చదవండి. అసలు మృత్యువేలేదనీ, మనం వారసత్వంగా సృష్టిలోని సమస్తవస్తువులనుండీ ఎంతోకొంతమేరకు ఏదో ఒకటి సంతరించుకున్నామని తెలుసుకున్ననాడు, మన విజ్ఞానం మనపూర్వీకులు కట్టి ఇచ్చిన భవనాలమీద మరొక అంతస్థువెయ్యడం వంటిదే తప్ప కొత్తగా ఆవిష్కరించింది కాదు అని తెలిసిననాడు, మన పూర్వీకులు మనలా రూపాంతరం చెందినట్లే, మనం కూడా మన పిల్లలుగా, మనవలుగా రూపాంతరం చెందుతామన్న సత్యం అవగతమైతే (“ఆత్మావై పుత్రనామాసి” అన్నది అందుకే. అయితే ఇక్కడ పుత్ర శబ్దం పరిధి ఒక్క కొడుక్కేకాదు పిల్లలుగా అని మనం అర్థం చేసుకోవాలి) మృత్యువుగురించిన భయం ఉండదని కవి భావన. శంకరాచార్యులు తమ అద్వైత సిధ్ధాంతంలో, జీవాత్మ పరమాత్మ అన్నవి రెండులేవు. ఉన్నది ఒక్కటే ఆత్మ. దాని స్వరూపమే ఈ చరాచర ప్రకృతిలోని అన్నిరూపాలుగా కనిపిస్తుంది అన్నారు. ప్రకృతినే పరమాత్మగా భావించగలిగినపుడు, మృత్యువు అన్నది లేదనీ, ఈ సృష్టి ఉన్నంతకాలమూ మనం శాశ్వతమనీ అర్థమవుతుంది. అప్పుడు స్థావర జంగమాల మధ్య విభేదం నశిస్తుంది. ఒకరు గొప్ప ఒకరు తక్కువ అన్న భావన పోతుంది. అన్ని జన్మలకంటే, మానవజన్మే గొప్పది అనుకుంటే, దానికి ఇక్కడ సమాధానం దొరకదు. దానిలక్ష్యం, సిధ్ధాంతప్రాతిపదికలు భిన్నంగా ఉంటాయి.
ఇది నా అవగాహన మేరకు చెప్పింది మాత్రమే. అందులో పొరపాట్లు దొర్లడానికి బోలెడంత ఆస్కారం ఉంది. కనుక మీకు నచ్చినమేరకి ఇందులోని భావాలు గ్రహించండి. మిగిలినవి వదిలేయండి. ఎందుకంటే ఇలాంటి చర్చలు ఎప్పుడూ అసంపూర్ణంగానే ఉంటాయి.
అభివాదములతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
నండూరి రామమోహన రావు గారి విశ్వదర్శనం ఇంకా విశ్వరూపం గతం లోనే చూడటం జరిగిందిన్దండీ! మళ్ళీ అంత స్థాయిలో తెలుగులో philosophical పరమైన గ్రంథాలు వచ్చినట్లు నా దృష్టికి రాలేదు,
ఒక brief idea వచ్చేస్తుంది, ఆ గ్రంథం చదివితే, ఆయన తెలుగు జాతికే భలే కృషి చేసారు, మీరు మీ తత్వ వేత్తల తెలుగు బ్లాగును శీఘ్ర గతిన ప్రారభిన్చవలేనని ఆశిస్తున్నాను హృదయ పూర్వకం గా!!మెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
-
శరీరం అశాశ్వతం..మానసిక సౌందర్యమొక్కటే శాశ్వతం అని కదూ ఈ కవిత భావన..బావుంది మూర్తి గారూ..ఎప్పుడూ చదవని కవితలు మీ అనువాదంతో చదవగలుగుతున్నాము. ధన్యవాదములు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
అమ్మా జ్యోతిర్మయీ,
ఇక్కడ సౌందర్యం అంటే, ఆత్మసౌందర్యం. ఆత్మ అనగానే ఒక పెద్ద తాత్త్విక చర్చ మొదలౌతుంది. (త్వరలోనే పూర్వ పశ్చిమ తాత్త్విక దృక్పధాలమీద కొన్ని అనువాదాలు ప్రారంభిద్దామనుకుంటున్నాను). అది ప్రకృతిలో మనల్ని మనం చూడగలగడం. నిజానికి మనకి ఈ ప్రకృతి ఎందుకింత ఆనందాన్నీ ప్రేరణనీ ఇవ్వాలి? ఇస్తోంది? ఏదో చెప్పలేని ఏకీభావన(oneness, Identity) కలుగుతోంది? ఎందుకంటే, అక్కడా ఇక్కడ ఉన్న వస్తువు, అది material గా చూసినా, spiritual గా చూసినా, ఒక్కటే. ఈ సత్యాన్ని గ్రహించినపుడు, మృత్యువు మనని భయపెట్టదు. మృత్యువు అంటే మనం ఏదో కోల్పోతున్నట్టు (deprivation) లా బాధపడుతుంటాం. మృత్యువు అన్నదే లేదు, మనలో మన తాతలూ తండ్రులూ ఉన్నారు, మనలో ఆదిమ మనవుడు ఉన్నాడు, మనలో పిపీలికాది బ్రహ్మపర్యంతమూ ఉన్న సమస్తజీవరాసుల వారసత్వం ఉంది, ఎందుకంటే మనం అన్ని రూపాలూ చెందే ఇప్పుడిలా ఉన్నాం. మళ్ళీ స్థావర జంగమాది సమస్త రూపాలు చెందుతాం… సైన్సు చెప్పిన కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ లాంటిది ఇది … శక్తి రూపాంతరాలు చెందుతుంది తప్ప, దానికి మరణం లేదన్నట్టుగానే, మనం విశ్వం పుట్టినదగ్గరనుండి ఇప్పటిదాకా ఎన్ని రూపాలు సంతరించుకుని ఉంటాం? ఇంకెన్నిరూపాలు సంతరించుకోబోతాం. ఈ సత్యం మృత్యువంటే భయాన్ని పోగొడుతుంది. అదే మృత్యువుతో చేసే యుధ్ధం. ఈ సత్యాన్ని గ్రహించడమే సౌందర్యారాధన. మాటలు సత్యాన్ని నిర్వచిస్తున్నాయిగదా అని, సత్యం మాటల్లో ఉందనగలమా? అది మాటలకి వెలుపల ఉంది. అలాగే, సౌందర్యం సత్యం యొక్క ఆకృతి(manifestation). సత్యాన్ని తెలుసుకునే సాధనం. అదే ఆమె సమగ్రమైన పశ్చిమ తాత్త్విక దృక్పథాన్ని (western Philosophical thought) ప్రతిబింబిస్తూ చెప్పినది. ఇది పూర్తిగా material దృక్పథంలోంచి చెప్పిన సత్యం. ఏకీభవించవచ్చు… ఏకీభవించకపోవచ్చు.
నేను సరిగా చెప్పగలిగేనో లేదో! అర్థం కాకపోతే, మరొకసారి ప్రయత్నిస్తాను.
ఆశీస్సులతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
-
ఏదైనా విషయం అర్ధం కావాలంటే మనం ఆ దారిలో ఉన్నప్పుడే పూర్తిగా అర్థం చేసుకోగాలుతాము. అంటే కొంచెమైనా ఆ విషయాల పట్ల అవగాహన ఉండాలి. ఈ మధ్య విశ్వదర్శనం పుస్తకం చదువుతున్నాను….మీ వివరణ చక్కగా అర్ధమయ్యింది. ఇంత ఓపిగ్గా తెలుగు టైపు చేసి మాకు మీరందిస్తున్న ఈ సాహిత్యం వెలలేనిది మూర్తిగారూ..ధన్యవాదాలు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
-
జ్యోతిర్మయీ,
ధన్యవాదాలు నాకు కాదు తల్లీ, వాళ్ళకి మనసులోనే ధన్యవాదాలు అర్పించు. సోక్రటీసు మరణోదంతాన్ని రామమోహన రావు గారు అపూర్వంగా వ్రాసేరు. సోక్రటీసు విలువలు, అతని నమ్మకాలు, ఆ నమ్మకాలపైన ప్రగాఢమయిన విశ్వాసం మనకి కనిపిస్తాయి. మృత్యుముఖం లో మనిషి చేసే చేష్టలూ, చెప్పేమాటలే వాళ్ళ విశ్వాసాలకు గీటురాయి. వాళ్ళు పడ్డ తత్త్వజిజ్ఞాసలోని బాధలు మనం పడకూడదని ఇంత చక్కగా మనకి అందించిన వాళ్ళకి మనం శతధా సహస్రధా కృతజ్ఞులమై ఉండాలి. వాళ్ళ వారసులుగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం.
ఆశీస్సులతోమెచ్చుకోండిమెచ్చుకోండి
-
Leave a reply to జ్యోతిర్మయి స్పందనను రద్దుచేయి